places
-
పట్నా నాటి ఔన్నత్యానికి దర్పణం
పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.బిహార్‌లో ఆలూపట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రచారం బాగున్నాయనిపించింది.ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలుపట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.గోల్ఘర్పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్‌గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది. ప్రాచీన కాలంలోకి ఎంట్రీపట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. పరిణిత శిల్పకళ ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్‌లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)కోల్‌కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్‌కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్‌లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
ఎకో ఊటీ.. నీలగిరి సౌందర్యం
ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్‌లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్ అవలాంచె చెక్‌పోస్ట్ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్ వ్యూ పాయింట్. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్ ట్రిప్ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్‌పోస్టు దగ్గర దింపుతారు.పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్ భవానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది. గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్ జోన్లోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్‌పోస్ట్ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్ డిపార్ట్మెంట్ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్‌కి గుర్తుగానూ ఉంటుంది.∙ -
మధుర, బృందావనమే కాదు... ఇక్కడ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.ద్వారక (గుజరాత్)గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.పూరి (ఒడిశా)ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముంబై (మహారాష్ట్ర)జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్బాగ్లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.గురువాయూర్(కేరళ)గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి. -
Best Indian Places: భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
శ్రీరామ నవమికి అయోధ్య వెళ్తున్నారా?.. వీటినీ సందర్శించండి!
అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. హనుమాన్‌గర్హి అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్‌గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్గర్హిని సందర్శిస్తారు. 2. కనక్ భవన్ త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్భవన్లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్‌కు తరలివస్తుంటారు. 3. దశరథ్ మహల్ దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది. 4. నాగేశ్వర్ నాథ్ ఆలయం శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు. 5. బహు బేగం సమాధి బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు. 6. సూర్య కుండ్ త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు. 7. రామ్ కి పాడి రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు. 8. సరయూ తీరం పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు. 9. గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం
ఉత్తరప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్న యోగి ప్రభుత్వం.. తాజాగా ‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగానూ ప్రణాళిక సిద్దం చేసింది. యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా , యుఎఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభించిన దరిమిలా ప్రతి సంవత్సరం కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ సంఖ్య స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. -
Rajasthan Haunted Places: రాజస్థాన్‌లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
ఇండియాలో చూడాల్సిన హాలిడే డెస్టినేషన్స్ ప్రదేశాలు
-
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
వెకేషన్ కోసం బెస్ట్ ప్లేసులు ఇవే..
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ
ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్‌కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్‌వెల్ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్‌లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. కంకారియా సరస్సు అహ్మదాబాద్‌లో కంకారియా సరస్సు అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి. భద్ర కోట అహ్మదాబాద్‌లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. లా గార్డెన్ నైట్ మార్కెట్ లా గార్డెన్‌కు చెందిన నైట్ మార్కెట్‌ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి. ఇది కూడా చదవండి: భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు -
అటు వైపు వెళ్లొద్దు సుమా.. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేసేస్
-
ఉత్తర భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
ప్రపంచంలోని 10 అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాలు
-
భారతదేశంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 హాంటెడ్ నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
టాప్ 10 ప్రపంచంలోని అత్యంత ఆకర్షించే ఇంజనీరింగ్ సైట్లు
-
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్‌లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా.. స్నేక్ ఐలాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది. సర్ట్ట్సీ ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్‌ల్యాండ్‌కు దగ్గరగా ఉంది. వాటికన్ రహస్య పత్రాలు.. ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్‌దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు.. బొహీమియన్ గ్రోవ్.. కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్‌ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు. స్వాల్బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్‌లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం. ఏరియా 51 ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. ఉత్తర సెంటినల్ ద్వీపం.. సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి. – సాక్షి సెంట్రల్ డెస్క్