అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. హనుమాన్‌గర్హి
అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్‌గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్‌గర్హిని సందర్శిస్తారు.
2. కనక్ భవన్
త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్‌భవన్‌లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్‌కు తరలివస్తుంటారు.
3. దశరథ్ మహల్
దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది.
4. నాగేశ్వర్ నాథ్ ఆలయం
శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు.
5. బహు బేగం సమాధి
బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు.
6. సూర్య కుండ్
త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్‌లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు.
7. రామ్ కి పాడి
రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు.
8. సరయూ తీరం
పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు.
9. గుప్తర్ ఘాట్
గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment