ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!.
సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్
ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి.
ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర
ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు.
తీహార్ జైలు, ఢిల్లీ
భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు.
సంగారెడ్డి జైలు, హైదరాబాద్
హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట.
వైపర్ ఐలాండ్, అండమాన్
ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు.
(చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!)
Comments
Please login to add a commentAdd a comment