Indian jailed
-
ఖైదీలా కాకుండా టూరిస్ట్‌గా సందర్శించే జైళ్లు ఇవే!
ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి. ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. తీహార్ జైలు, ఢిల్లీ భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు. సంగారెడ్డి జైలు, హైదరాబాద్ హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట. వైపర్ ఐలాండ్, అండమాన్ ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు. (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
భారత్ కన్నా రష్యా జైళ్లే నయం
లండన్: భారత జైళ్ల వ్యవస్థ రష్యాలో కన్నా ఘోరంగా ఉంటుందని విజయ్ మాల్యా తరఫున లండన్ కోర్టులో కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందం మంగళవారం వ్యాఖ్యానించింది. భారత్‌లో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి అప్పగించే విషయమై అక్కడి కోర్టులో సోమవారం నుంచి విచారణ ప్రారంభమవడం తెలిసిందే. మాల్యా తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ‘జైలులో విజయ్ మాల్యాకు సురక్షిత వాతావరణం కల్పిస్తామని భారత అధికారులు చెబుతున్నా అందుకు అనువైన యంత్రాంగమేదీ అక్కడ లేదు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు గురైనప్పుడు కూడా పరిస్థితిని అక్కడి ప్రభుత్వం సరిదిద్దడం లేదు. రష్యాలో జైళ్లు భారత్‌లో కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయి’ అని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్కు తెలిపారు. సాధారణంగా రష్యాలో ఖైదీల అప్పగింత కేసులు అక్కడి జైళ్లలో ఉండే సదుపాయాలపై ఆధారపడి ఉంటాయి. అలాంటి దేశంతో భారత్‌ను ఎలా పోలుస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా... కోర్టు ఆదేశాలు జైలులో ఉల్లంఘనకు గురవుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కనీసం రష్యాలో అయితే అంతర్జాతీయ నిపుణులను అనుమతిస్తారనీ, కానీ భారత్‌లో ఆ అవకాశం కూడా ఉండదని వివరించారు. -
ఫేస్బుక్ స్టేటస్ చూసి.. ఎన్నారై అరెస్టు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఓ కోర్టు అక్కడున్న భారతీయుడికి ఏడాది జైలుశిక్ష విధించింది. ఫేస్బుక్లో మతవిద్వేష పూరితంగా తన స్టేటస్ పెట్టుకున్నందుకే ఈ శిక్ష పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. తన ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేసే సమయంలో ఇస్లాం మతాన్ని, మహ్మద్ ప్రవక్తను అతడు (41) తిట్టాడని దుబాయ్ కోర్టు నిర్ధారించింది. గత సంవత్సరం జూలై నెలలో ఇరాక్ యుద్ధం గురించి ఒక న్యూస్ బులెటిన్ చూసిన తర్వాత అతడు తన స్టేటస్‌ను అప్డేట్ చేశాడు. జైలుశిక్ష పూర్తయిన తర్వాత అతడిని దుబాయ్ నుంచి స్వదేశానికి తిప్పి పంపేయాలని జడ్జి ఇజ్జత్ అబ్దుల్ లాత్ తన తీర్పులో చెప్పారు. నిందితుడి ఫేస్బుక్ స్టేటస్ తనకు వాట్సప్‌లో వచ్చిందంటూ దుబాయ్‌లో ఉండే మరో భారతీయుడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలుశిక్ష పడింది. అయితే, 15 రోజుల్లోగా ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
చిలిపి చేష్టలతో చెరసాల పాలయ్యాడు
సింగపూర్: సింగపూర్ లో మహిళపై చిలిపి చేష్టలకు దిగి చెరసాల పాలయ్యాడో భారతీయుడు. బస్సులో మగువ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేరానికి మూడు వారాల జైలుశిక్షకు గురయ్యాడు. డిపార్ట్ మెంట్ స్టోర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న నిందితుడు సీతారామన్ రమేష్(32) గత ఏడాది వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు 39 ఏళ్ల మహిళను వేధించినందుకు జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. గతేడాది జూలై 25న బస్సులో మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని స్థానిక మీడియా తెలిపింది. ముందుగా చివరి సీటులో కూర్చున్న సీతారామన్ వరుసగా సీట్లు మారుతూ 20 నిమిషాల తర్వాత సదరు మహిళకు చేరువగా వచ్చి చిలిపి చేష్టలకు దిగాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అతడు చేసిన నేరానికి రెండేళ్ల జైలు, జరిమానాతో పాటు కొరడా దెబ్బలు కొట్టేవారే. కాని సీతారామన్ పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని.. చేసిన తప్పుతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చిందని కోర్టుకు అతడి తరపు లాయర్ విన్నవించడంతో స్వల్ప శిక్షతో సరిపెట్టింది. -
సింగపూర్‌లో ఎన్నారైకు జైలు శిక్ష
సింగపూర్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై సత్తయ్య ఇళయరాజాకు సింగపూర్ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లో తనతో ప్రయాణిస్తున్న మహిళ పట్ల సత్తయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె ప్రతిఘటించింది. మళ్లీ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించబో తరుణంలో ఆమె లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చి... పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు సత్తయ్యను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు వాదోపవాదాలు విన్న కోర్టులో గురువారం తుది తీర్పు వెలువరించింది. నిందితుడు సత్తయ్య ఇళయరాజాకు 9 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు శుక్రవారం స్ట్రెయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. -
సింగపూర్‌లో వేధింపులు: భారతీయుడికి జైలు
రైల్వేస్టేషన్‌లోని లిఫ్టులో మహిళను వేధించినందుకు సింగపూర్‌లో ఓ భారతీయుడికి నాలుగు వారాల జైలుశిక్ష విధించారు. కందసామి కృష్ణన్ (27) అనే ఆ వ్యక్తి సింగపూర్‌లోని ఓ విద్యుత్ ఉపకరణాల కంపెనీలో పనిచేస్తాడు. సింగపూర్‌లోని సెరాంగూన్ రైల్వేస్టేషన్‌లోని ఓ లిఫ్టులో ఫిలిప్పీన్స్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను చెయ్యి పట్టుకుని గట్టిగా లాగి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చి 7వ తేదీన జరిగింది. అయితే తాను నిర్దోషినని, ఆమెను తానేమీ చేయలేదని కందసామి కోర్టులో వాదించాడు. ఆరోజు ఉదయం 7.45 గంటలకు అతడు అప్పర్ సెరాంగూన్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాడని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అస్రాన్ సమద్ తెలిపారు. వీధిలోకి వెళ్లేందుకు ఆమె లిఫ్టులోకి వెళ్లగానే, కందసామి ఆమె వెంటపడి.. లిఫ్టు తలుపు దాదాపు మూసుకుపోతుండగా లోపలకు వెళ్లాడని, ఆమె చెయ్యి పట్టుకుని లాగి ముద్దు పెట్టుకోబోయాడని అన్నారు. దీంతో న్యాయమూర్తి అతడికి నాలుగు వారాల జైలుశిక్ష విధించారు. -
భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు
లండన్: కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. దక్షిణ యార్క్‌షైర్‌లోని బమ్స్లే ప్రాంతంలో ఉంటున్న అజిత్ శేఖన్ గతేడాది అక్టోబర్‌లో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్(55), కుమారుడు పాల్(31)పై దాడికి పాల్పడ్డాడు. టీవీ చూస్తున్నారనే కోపంతో లోహపు పాత్రతో వీరిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అజిత్ భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ జరిపిన కోర్టు అజిత్‌ను దోషిగా తేల్చింది. కొడుకును కొట్టినందుకు 9 ఏళ్ల నెలలు, భార్యను గాయపరిచినందుకు 6 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈనెల 9న షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.