ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి, అమృత్ కౌర్ (ఇన్‌సెట్‌లో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిమ్స్... అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఐఐఎంఎస్) ఆస్పత్రి. ధనవంతులకు, పేదవాళ్లకు ఎలాంటి తారతమ్యం లేకుండా సకల వైద్య సేవలు అందించే సంస్థ. ముఖ్యంగా ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించే ఆర్థిక స్థోమతలేని పేదల పాలిట కల్పవల్లి. 1956లో ఢిల్లీలో ఏర్పాటైన ఎయిమ్స్ 2012లో మొదటి సారి విస్తరించి దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించిన మహా వ్యక్తి, ఓ మహిళా శక్తి గురించి మనం కాల గమనంలో మర్చిపోయాం.
ఆమెనే కపూర్తలా యువరాణి అమత్ కౌర్. మహారాజా కుటుంబానికి చెందిన యువరాణి అవడం వల్ల కోటలో ఉండే కోట్ల రాసుల్లో కొన్ని రాసులను కుమ్మరించి ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించి ఉంటారులే అనుకుంటే పొరపాటే. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తికాగానే విదేశీ పాలకుల నుంచి భారత్ విముక్తి కోసం జాతీయ ఉద్యమంలో చేరి వీరోచిత పోరాటం సాగించిన మహిళామణి ఆమె. రాజకుటుంబ వారసత్వాన్ని వదులుకొని చివరి వరకు నిరాడంబరంగా జీవించడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశం కోసం, మహళల హక్కుల కోసం, వారి సాధికారికత కోసం ధారపోసిన ధీరవనిత ఆమె.
ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్లూహెచ్‌ఓ) పాలనా వ్యవహారాలు చూసే వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి అధ్యక్షులుగా (1950లో) ఆసియా ఖండం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి, తొలి మహిళగా ఆమె రికార్డు సష్టించారు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పనిచేసిన దేశ తొలి ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఆమెనే. ఆమె 1945లో లండన్‌లో జరిగిన యునెస్కో కాన్ఫరెన్స్‌కు భారత అధికారిక ప్రతినిధిగా హాజరయ్యారు.
1926లోనే ఆమె ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసమే కాకుండా బాల్య వివాహాలు, మహిళలను దాచేసే పరధా సంస్కతి, దేవదాసీల విధానానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం జరిపారు. ఆమె పోరాటం కారణంగానే భారత ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 14 నుంచి 18 ఏళ్లకు పెంచింది. మహిళల విద్యాభివద్ధి కోసం ఆమె ‘అఖిల బారత మహిళా విద్యా నిధి సంఘం’ను కూడా ఏర్పాటు చేశారు. బహు భార్యత్వం లాంటి మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూడా పోరాడారు. ఆమె చిన్నతనంలోనే హాకీ, క్రికెట్ టీమ్‌లకు కెప్టెన్‌గా పనిచేశారు. పాటియాలలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
అమత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2వ తేదీన కపుర్తలా రాజకుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్. ఆయన అప్పటి కపుర్తలా రాజుకు స్వయాన తమ్ముడు. ఒకప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కపుర్తలా ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో కలిసింది. కౌర్ తండ్రికి ఏడుగురు సంతానం కాగా, ఒక్కరే అమ్మాయి. అమత్ కౌర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా లక్నోలోనే సాగింది. మాధ్యమిక విద్యాభ్యాసం ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌లో ‘షెర్‌బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్’లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో పూర్తి చేశారు.
1918లో మాతదేశానికి తిరిగొచ్చారు. అదే సమయంలో అమత్‌సర్‌లో భారత పౌరులకు, బ్రిటీష్ సైనికులకు మధ్య వీధి పోరాటాలు జరగడంతో పంజాబ్ ప్రజలంతా బ్రిటీష్ పాలకులపై ఆగ్రహోదగ్రులై ఉన్నారు. వారిని అణచివేయడం కోసం బ్రిటీష్ పాలకులు రోలాట్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1919, ఏప్రిల్ నెలలో జరిగిన ‘జలియన్‌వాలాబాగ్’ ఊచకోత ఘటన ప్రజల్లో మండుతున్న అగ్నికి ఆజ్యం పోసింది.
ఈ దశలో తన తండ్రికి స్నేహితుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడైన గోపాల్ కష్ణ గోఖలేను అమత్ కౌర్ కలుసుకున్నారు. అప్పుడు గోఖలే ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిమ్నవర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నారు. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చూసి అమత్ కౌర్ స్ఫూర్తి పొందారు.
వెంటనే దేశ జాతీయోద్యమంలో చేరారు. ‘విదేశీ పాలకుల చెర నుంచి నా భారత దేశం విముక్తిని చూడాలని నాలో ఉద్భవించిన భలమైన కోరిక ప్రజ్వరిల్లడానికి స్ఫూరినిచ్చిందీ ఆయనే’ అంటూ ఆ తర్వాత ఆమె గోఖలే గురించి రాసుకున్నారు. ఆయన ద్వారా జాతిపితి మహాత్మా గాంధీ గురించి తెలుసుకొని గాంధీజీ ఆశ్రయంలో పనిచేయాలనుకున్నారు. ఆ మేరకు గాంధీకి ఓ లేఖ కూడా రాశారు.
అయితే ఇంతలో తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా ఆమె కపుర్తలా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉంటూ కూడా ఆమె పేదలు, బడుగు వర్గాలు, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం కషి చేశారు. 1926లో ‘ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్’ను స్థాపించి మహిళల హక్కులు, సాధికారిత కోసం తన పోరాటాన్ని ఉధతం చేశారు. 1930లో ఆమె తల్లిదండ్రులు మరణించడంతో కౌర్ కపుర్తలాను పూర్తిగా విడిచేసి స్వాతంత్య్ర పోరాటంలో మహిళలకు నాయకత్వం వహించారు.
మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్రలో, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని అర్థం చేసుకున్న గాంధీజి 1936, అక్టోబర్‌లో ఆమెకో లేఖ రాశారు. ‘తన మిషన్ సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ఓ మహిళ కోసం నేను వెతుకుతున్నాను. ఆలాంటి మహిళ మేరేనా, మేరేనా ఆ ఒక్కరు!’ అన్న గాంధీ పిలుపుకు స్పందించి ఆమె గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా చేరిపోయారు.
దేశ తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానించే వరకు ఆమె గాంధీజీ కార్యదర్శిగానే ఉన్నారు. ఆమె ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘ట్యూబర్‌కులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్, ది సెంట్రల్ లెప్రసీ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, రాజ్‌కుమారి అమత్ కౌర్ కాలే జ్ ఆఫ్ నర్సింగ్’ ఏర్పాటు చేశారు. వివిధ అంతర్జాతీయ వేదికలను అడ్రెస్ చేసిన అనుభవంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, పశ్చిమ జర్మనీ, అమెరికా దేశాల నుంచి నిధులను సమీకరించారు. ఎయిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సుల ఉపశమనం కోసం తన పూర్వికుల నుంచి తనకు సంక్రమించిన సిమ్లాలోని ‘మనోర్‌విల్లీ’గా పిలిచే రాజభవనాన్ని కేటాయించారు.
అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ 150వ వార్షికోత్సవం సందర్భంగా 1961లో అమత్ కౌర్ స్థాపించిన ఎయిమ్స్‌ను ప్రపంచంలో పేరుపొందిన ఉన్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తించింది. ఆ తర్వాత కౌర్ తన పోరాటాన్ని ప్రధానంగా మలేరియా మహమ్మారి వైపు మళ్లించారు. అప్పటికే భారత దేశంలో ఏడాదికి పది లక్షల మంది ప్రజలు మలేరియా వల్ల మరణిస్తున్నారు. మలేరియాకు వ్యతిరేకంగా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చర్యల వల్ల ఆమె దాదాపు నాలుగు లక్షల మంది ప్రజల ప్రాణాలను రక్షించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1964లో ఆమె తన 75వ ఏట ప్రశాంతంగా కన్నుమూశారు.
సిమ్లాలోని మనోర్‌విల్లీ భవనం.
అప్పటి గవర్నర్ జనరల్ సీ. రాజగోపాలాచారి, ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూలతో దేశ తొలి ఆరోగ్య శాఖా మంత్రిగా అమృత్ కౌర్.
ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మహిళల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కౌర్.
మహాత్మా గాంధీతో అమృత్ కౌర్.
మలేరియా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అమృత్ కౌర్.
Comments
Please login to add a commentAdd a comment