
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెంకడ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తించి భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో థర్డ్‌వేవ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కోవిడ్ మూడో వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపారు. అన్‌లాక్‌తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, వైరస్ అంటేనే మ్యుటేషన్లకు గురవుతూ ఉంటుందని తెలిపారు. హాట్‌స్పాట్లలో తగిన నిఘా అవసరమని పేర్కొన్నారు.
దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోస్ మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందని ఆయన వివరించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో కనీస కోవిడ్ నిబంధనల కూడా పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగి, కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయమని డాక్టర్ రందీప్ గులేరియా హెచ్చరించారు.
చదవండి: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు
Comments
Please login to add a commentAdd a comment