
ఢిల్లీ ఎయిమ్స్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రధాన అత్యవసర వార్డులో సోమవారం తెల్లవారుజామున ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మంటలను గంటలో అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రోగులందరినీ బాధిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. "ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో మంటలు, పొగ కనిపించింది. రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి తరలించారు. ఏడు ఫైర్ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని డీసీసీ సౌత్ అతుల్ ఠాకూర్ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి వెల్లడించారు.
చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే!
Comments
Please login to add a commentAdd a comment