తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించేందుకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఒకటి చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుంది. పల్మనాలజిస్టు డాక్టర్ జీసీ ఖిల్నాని, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్ నాయక్, అనస్థటిస్టు డాక్టర్ అంజన్ ట్రిఖాలతో కూడిన బృందం గురువారం ఉదయమే చెన్నై చేరుకుంది. వైద్యులు జయలలితను పరీక్షించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.