తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండెపోటు వార్త విన్నప్పటి నుంచీ అర్ధారత్రి రెండు గంటలవరకూ 'అమ్మ' జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూకు షిఫ్ట్ చేసి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని, అమ్మ త్వరలో ఇంటికి వెళ్లిపోతారని ఇటీవల కథనాలు రాగా.. ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.