విషాద సందర్భం...
తన జీవితంలోని విషాద సందర్భం తనకి స్ఫూర్తినిచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ మరణించిన సందర్భమేనంటారు.
ఇష్టమైన నాయకుడు..
వాజ్‌పేయ్ తనకిష్టమైన నాయకుడు తొలి ప్ర«ధాని జవహర్‌లాల్ నెహ్రూ అని అంటారు.
అభిమాన రచయితలు..
రాజకీయాల్తో పాటు సాహిత్యాన్నీ అమితంగా ప్రేమించిన వాజ్‌పేయికి ప్రముఖ రచయితలు శరత్ చంద్ర, ప్రేమ్ చంద్ అంటే చాలా ఇష్టం. అలాగే హరివంశరాయ్ బచ్చన్, రామనాథ్ అవస్తి, డాక్టర్ శిమంగల్ సింఘ్ సుమన్, సూర్యకాంత్ త్రిపాఠీ ‘నిరళ’, బాలకృష్ణ శర్మ నవీన్, జగన్నాథ్ ప్రసాద్ మిలండి, ఫియాజ్ అహ్మద్ ఫియాజ్‌ల నుంచి కవితాస్ఫూర్తి పొందానంటారు వాజ్‌పేయి.
కవి హృదయాన్ని మెప్పించిన క్లాసికల్ కళాకారులు!
భీమ్‌సేన్ జోషి, అమ్‌జాద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా వాజ్‌పేయి మదిమెచ్చిన కళాకారులు. అలాగే లతా మంగేష్కర్ పాటలన్నా, ముఖేష్ , ఎస్‌డి బర్మన్ అన్నా చెవికోసుకునేవాడట. ఇష్టమైన మ్యూజీషియన్ సచిన్ దేవ్ బర్మన్, ఇష్టమైన నటులు సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, సుచ్రిత సేన్, రాఖీ, నూతన్ అని చెపుతారు.
ఎస్‌డి బర్మన్ ‘‘ఓ....మేరే మాజీ’’‘‘సన్ మేరే బంధూ రే’’పాటలన్నా, ముఖేష్ కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’’పాటన్నా, ప్రాణం అంటారు. ముఖ్యంగా ముఖేష్, లతామంగేష్కర్ లంటే వాజ్‌పేయికి అమితమైన ఇష్టం. ఒకానొక సందర్భంలో లతామంగేష్కర్‌తో మాట్లాడుతూ వాజ్‌పేయి ‘‘మీకూ నాకూ చాలా దగ్గరి పోలికలున్నాయి. మీరూ ఒంటరివాళ్ళే, నేనూ ఒంటరినే, అలాగే నా పేరులో అటల్‌ని తిరగేస్తే (ఆంగ్ల అక్షరాల్లో) లత అని వస్తుంది’’అంటారు.
వాజ్‌పేయికి నచ్చిన సినిమాలు
దేవదాస్, బాంధినీ, తీస్‌రీ కసమ్, మౌసమ్, ఆంధీ వాజ్‌పేయ్‌కి నచ్చిన సినిమాలు. ‘‘బ్రిడ్జి ఓవ ర్ ద రివర్ క్వై’’, ‘‘బార్న్ ఫ్రీ’’, ‘‘గాంధీ’’ ఇంగ్లీషు సినిమాలు తనకిష్టమైనవంటారు వాజ్‌పేయి.
అటల్‌జీకి రుచించేవి..
అటల్‌జీ బాగా వంటలు చేసేవారట. వాజ్‌పేయి తండ్రికి బయటి భోజనం ఇష్టం లేకపోవడంతో తన తండ్రితో కలిసి ఉండేటప్పుడు తనే స్వయంగా వంట చేసి తండ్రికి వడ్డించేవారు. కిచిడీ, పూరి కచోరీ, దాల్–పకోరీ, పాంథ, ఖీర్ , మాల్‌పావ్, కచోరీ, మంగౌరీ వంటకాలు వాజ్‌పేయికి అత్యంత ఇష్టమైన వంటకాలు.
అటల్‌జీ మదిమెచ్చినవి
లతామంగేష్కర్ పాటా, హరిప్రసాద్ చౌరాసియామురళీగానం, గాంధీ సినిమా, శరత్ చంద్ర, ప్రేమ్‌చంద్ అక్షరం... పూరీ కచోరీ, ఖీర్, మాల్‌పావ్! అభిరుచుల్లో సున్నితత్వం, ఆహార్యంలో సాదాత్వం, అవసరమైనప్పుడు కటుత్వం మొత్తంగా ఆయన వ్యక్తిత్వం. మాటలతోనే కట్టిపడేసే మాంత్రికుడు, రాజకీయాటలో నేర్పూ, జనం మది గెలుపులో ఓర్పూ అటల్ బిహారీ వాజ్‌పేయిని రాజకీయాలకతీతంగా అభిమానించేలా చేశాయి. ఓ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడిగానే కాక కవిగా, రచయితగా, మంచి వక్తగా ప్రజలమెప్పునొందిన వాజ్‌పేయి వ్యక్తిగత ఇష్టాఇష్టాలు అతని స్వభావాన్ని చెప్పకనే చెబుతాయి. ఆయన జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులూ, అతనికిష్టమైన సంగీతం, అతని మదిని చెదిరిపోని సందర్భాల్లో మచ్చుకి కొన్ని ...
అదే చేదు ఘడియ
ఒంటరి జీవితాన్ని జీవితాంతం గడిపిన వ్యక్తి వాజ్‌పేయ్. కవిత్వంతోనే రాజకీయరంగ ప్రవేశం చేసానని చెప్పుకున్న వాజ్‌పేయి తన జీవితంలో అత్యంత చేదు ఘడియలేవైనా ఉన్నాయంటే అది ఐదవ తరగతిలో తన మాస్టారు చెంపఛెళ్ళుమనిపించిన సందర్భమేనంటారు.
అందుకు సమయం లేదు
మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే పెళ్ళి చేసుకునే తీరిక తనకు లేదన్నారు.
థ్రిల్లింగ్ మూవ్‌మెంట్
రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తనని ఆçహ్వానించినప్పుడు అత్యంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యానంటారు.
ప్రియ మిత్రులు...
ఆనాటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్, అప్పా ఘటాటే, నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్, డాక్టర్ ముకుంద్ మోడీ, అలాగే శివకుమార్‌లు తనకు అత్యంత సన్నిహిత మిత్రులంటారు.
మరపురాని ఘటన..
ఐరాస జనరల్ అసెంబ్లీలో తొలిసారిగా, అదీ కూడా హిందీలో ఉపన్యసించడం తన జీవితంలో మరపురాని ఘటన అంటారు.
స్ఫూర్తి...
తన తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయి తనకు స్ఫూర్తి ప్రదాత అనీ, గురు గోల్వాకర్‌జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, ఆర్‌ఎస్‌ఎస్ బాబూరావ్ డియోరాజ్ లు తనకి స్ఫూర్తినిచ్చినవారంటారు.
Comments
Please login to add a commentAdd a comment