న్యూఢిల్లీ: దేశ రాజధానిని వణికిస్తున్న చికున్ గున్యా వైరస్ జన్యురూపాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. 2006లో విజృంభించిన ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ వైరస్సే ఇప్పుడూ పీడిస్తోందని తేల్చారు.
ఈ సీజన్‌లో ఢిల్లీలో ఇప్పటిదాకా 3,700 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వైరస్‌ను గుర్తించి, నివేదికను జాతీయ సంక్రమిత వ్యాధుల నియంత్రణ పథకం వారికి పంపామని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఆసియన్, వెస్ట్ ఆఫ్రికన్, ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ అని మూడు జన్యురూపాల్లో ఉంటుంది.
చికున్‌గున్యా జన్యురూపం గుర్తింపు
Published Tue, Sep 27 2016 3:16 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement