ఎయిమ్స్‌లోనూ చికిత్సాలోపం.. లక్ష జరిమానా
ఏదో చిన్నా చితకా ఆస్పత్రులలో వైద్యసేవల లోపం జరిగిందంటే అనుకోవచ్చు.. ఎయిమ్స్ లాంటి పెద్ద ఆస్పత్రిలో కూడా అదే తంతు అని తేలింది. ఓ బాలిక కార్నియా ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమె తల్లిదండ్రులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఎయిమ్స్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హర్యానాకు చెందిన ప్రియాంకకు మూడుసార్లు కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. కానీ మూడూ ఫెయిలయ్యాయి.
తగినంత జాగ్రత్తలు తీసుకోకుండా ఆపరేషన్లు చేయడం వల్లే ఇలా జరిగిందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తేల్చింది. ఇందుకు గాను బాలిక తల్లిదండ్రులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 1998 నుంచి 2001 వరకు మూడు సార్లుగా ప్రియాంకకు ఎయిమ్స్‌లో కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. అయితే తమ వైద్యంలో ఎలాంటి లోపం లేదంటూ ఎయిమ్స్ వాదించింది.