
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలకాంశాల గురించి చర్చించినట్లు సమాచారం. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అమిత్ షా నార్త్ బ్లాక్ కార్యాలయంలో మొదటి సారి ఈ రోజే సమావేశం అయ్యారు. అమిత్ షా ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి సమీక్షా సమావేశంలో హోం మంత్రి అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆ కీలకాంశాలు ఏంటనే దాని గురించి సమాచారం లేదు. (ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ)
Comments
Please login to add a commentAdd a comment