ఈ నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Holds Review Meeting on Covid-19 Prevention, Vaccination | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి: సీఎం జగన్‌

Published Thu, Feb 3 2022 5:21 PM | Last Updated on Thu, Feb 3 2022 5:38 PM

CM YS Jagan Holds Review Meeting on Covid-19 Prevention, Vaccination - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. 

సమీక్షలోని ముఖ్యాంశాలు..
కోవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని తెలిపిన అధికారులు
అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడి
రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితులు కేవలం 2301 మందేనని తెలిపిన అధికారులు
ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది, వీరుకూడా దాదాపుగా కోలుకుంటున్నారన్న అధికారులు
2144 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడి.
104 కాల్‌ సెంటర్‌కూ వస్తున్న కాల్స్‌ గణనీయంగా తగ్గాయన్న అధికారులు
నిన్నటిరోజున వచ్చిన కాల్స్‌ కేవలం 246, ఇందులో ఆస్పత్రిలో జాయిన్‌ అయినవారు 18 మంది మాత్రమేనని వెల్లడి

వ్యాక్సినేషన్‌ 
వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందన్న అధికారులు
రెండు డోసులు వేసుకున్నవారు 3,73,71,243 కాగా, ఒక డోసు వేసుకున్నవారు 55,38,556
ప్రికాషనరీ డోస్‌ టార్గెట్‌ 12,60,047 కాగా ఇప్పటికే 9,79,723 మందికి వాక్సినేషన్‌ పూర్తి
రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడి.

చదవండి: (నాడు-నేడు: సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు)

ఈ సందర్భంగా సీఎం జగన​ ఏమన్నారంటే...
ఫిబ్రవరి మాసాంతానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం. 
నాడు – నేడు కింద చేపట్టిన పనులను సమీక్షించిన సీఎం
అలాగే వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం
నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టంచేసిన సీఎం

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి పెట్టి.. ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశం
గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానని వెల్లడించిన సీఎం
గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే.. దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్న సీఎం.
గిరిజన ప్రాంతాల్లోనే కాదు.. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలన్న సీఎం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం
డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని స్పష్టంచేసిన సీఎం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో  స్పష్టంగా మార్పులు కనిపించాలన్న సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement