న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కుటుంబానికి పూర్తిగా దూరమవ్వాల్సి వస్తోంది. ప్రాణాంతక వైరస్ సోకకుండా తమను తాము రక్షించుకోవడంతో పాటుగా కుటుంబ సభ్యులకు తమ కారణంగా హాని కలగకూడదనే ఉద్దేశంతో క్వారంటైన్‌లో ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మహిళా డాక్టర్ అంబిక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఆమె.. విపత్కర పరిస్థితుల్లో కుటుంబం మద్దతు తమకు ఎంతగానో ముఖ్యమని.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.(ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్)
‘‘కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. అందరికీ సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో మా అందరికీ కుటుంబం అండ ఎంతగానో అవసరం. సొంతవాళ్లు ఎవరైనా ఇప్పుడు అనారోగ్యం పాలైతే వారికి మేం చికిత్స అందించలేం. ఆ అపరాధ భావన మమ్మల్ని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఇక్కడ సహోద్యోగులు, స్నేహితులు, ఇతర సిబ్బంది మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారనే విషయం మాకెంతో సాంత్వన కలిగిస్తుంది’’అంటూ డాక్టర్ అంబిక కన్నీటి పర్యంతమయ్యారు.(‘భారత్ అమ్మాలనుకుంటేనే పంపిస్తుంది’)
#WATCH Dr Ambika, who is posted at #COVID19 treatment ward of Delhi AIIMS, breaks down while speaking about her professional challenges amid coronavirus pandemic. pic.twitter.com/erNNUIh7Il
— ANI (@ANI) April 6, 2020
Comments
Please login to add a commentAdd a comment