సుష్మాస్వరాజ్కు అస్వస్థత
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. ఆమెకు పలు మార్లు ఛాతి నొప్పి రావడంతో సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో శ్వాసకోశ సంబంధమైన మెడిసిన్ విభాగంలో ఆమె చేరారు. రాత్రి పదిగంటల ప్రాంతంలో ఆమెను కార్డియో న్యూరో సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ సీనియర్ వైద్యులు తెలిపారు.