న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్, ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాథ్ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్న 78 ఏళ్ల జితేంద్ర శనివారం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రత్నదీప్ గులేరియా తెలిపారు. ‘కొద్దిపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా డాక్టర్ జితేంద్ర, ఆయన భార్యకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో మంగళవారం నుంచి వారు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని మేము నిరంతరం సమీక్షించాం. అతను కోలుకుంటున్నట్టుగానే కనిపించారు. నిన్న రాత్రి భోజనం చేసి పడుకున్నాక ఆయన మృతి చెందారు. నిద్రపోతున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించి ఉంటారు’ అని చెప్పారు.
జితేంద్ర మృతిపై ప్రముఖ వైద్యురాలు సంగీత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పల్మనాలజిస్ట్‌గా ఆయన అందించిన సేవలు.. ఎంతో మంది ఆరోగ్యంగా ఉండేలా చేశాయని అన్నారు. వైద్య ప్రపంచం ఓ ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.(చదవండి : భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment