సుష్మాకు త్వరలో కిడ్నీ మార్పిడి
• ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
• త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వందలాది ట్వీట్లు
న్యూఢిల్లీ: మూత్రపిండం వైఫల్యంతో బాధపడుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (64)కు ఢిల్లీలోని ఎరుుమ్స్ వైద్యులు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. త్వరలో ఆమెకు కిడ్నీ మార్పిడి చేసే అవకాశముంది. అరుుతే, కిడ్నీ మార్పిడికి కొంతసమయం పట్టొచ్చని, సుష్మ కుటుంబంలో దాత సరిపోలనందున, బయటి దాత కోసం అన్వేషిస్తున్నామని వైద్యులు చెప్పారు. తన కిడ్నీ సమస్య అంశాన్ని సుష్మానే ట్విటర్‌లో తెలిపారు. ‘ మిత్రులారా.. మూత్రపిండం వైఫల్యంతో ఎరుుమ్స్‌లో చేరాను.
డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి సంబంధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణపరమాత్ముని ఆశీస్సులు ఉంటాయనుకుంటున్నా’ అని బుధవారం ట్వీట్ చేశారు. ఎరుుమ్స్‌లో ముఖ్య విభాగాల వైద్యుల బృందం ఆమెకు వైద్యం అందిస్తోంది.సుష్మ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించి, త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేశారు. కిడ్నీ ఇవ్వడానికి తాము సిద్ధమని కొందరన్నారు. త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్, కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జయంత్ సిన్హా , ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు కేజ్రీవాల్, వసుంధరా రాజే, కాంగ్రెస్ నేత అంబికా సోనీ, నేషనల్ కాన్ఫరెన్‌స నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఆకాంక్షించారు. 20 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మా ఏప్రిల్‌లోనూ ఊపిరితిత్తులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎరుుమ్స్‌లో చేరారు.