గుంటూరులోని తులసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన వేశపోగు వినయకుమారి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఈ మధ్య ఫిట్స్ రావడంతో గుంటూరు తులసి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి న్యూరాలజీ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారిని సంప్రదించింది.