నిద్రలేమిని గుర్తించడం ఎలా? | ResMed Wake Up To Good Sleep Campaign Sponsored | Sakshi
Sakshi News home page

‘రెస్‌మెడ్‌’ మంచి నిద్ర ప్రచారం (స్పాన్సర్డ్‌)

Published Tue, Nov 17 2020 3:41 PM | Last Updated on Mon, Dec 21 2020 11:34 AM

ResMed Wake Up To Good Sleep Campaign Sponsored - Sakshi

#WakeUpToGoodSleep ప్రచారం ద్వారా మంచి నిద్ర ప్రాధాన్యతను తెలియజెప్తున్న రెస్‌మెడ్‌

నిద్ర రుగుత్మలపై వైద్యులు, వినియోగదారులను చైతన్యపరచనున్న ఈ డిజిటల్‌ ప్రచారం

న్యూదిల్లీ: 17 నవంబర్, 2020- డిజిటల్ హెల్త్, సంబంధిత (నిద్ర, శ్వాససంరక్షణ) పరికరాల్లో ప్రపంచ అగ్రగామి రెస్‌మెడ్‌ (ResMed) సరికొత్త నిద్ర అవగాహన ప్రచారం #WakeUpToGoodSleepను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యంగా ఉండేందుకు చక్కని నిద్రకున్న ప్రాధాన్యతను, భారతదేశంలో పెరుగుతున్న, గుర్తించని నిద్ర రుగ్మతలను వివరించడమే కాకుండా వాటి చికిత్సకు అందుబాటులో ఉన్నఅవకాశాలను ఈ ప్రచారం నొక్కిచెప్తుంది. నేడు, లక్షలమంది భారతీయులు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారు, కాని అందులో చాలా మటుకు గుర్తించడడం జరగదు. 2019లో ల్యాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో లక్షలాది మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ నిద్ర రుగ్మతలను చక్కదిద్దకుండా వదిలేస్తే అది గుండెపోటు, డయాబెటిస్, డిప్రెషన్ సహ మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదకారిగా పరిణమించవచ్చు. ఇవన్నీ నిద్రరుగ్మతలపై అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నాయి. వినియోగదారులు, డాక్టర్లకు అవగాహన పెంచేలా ఈ ప్రచారం తోడ్పడుతుంది. ఈ ప్రచారంలో భాగంగా చిన్న అవగాహన చిత్రాన్నిరెస్‌మెడ్‌ ఆవిష్కరించింది. ఇది నిద్రలేమి, అంతగా తెలియని నిద్ర రుగ్మతలు, అలసట, మానసిక ఒత్తిడి, చికాకు, ట్రాఫిక్‌ ప్రమాదాల వంటి వాటి ప్రభావాలను తెలియజెప్తూ రాత్రివేళ మంచి నిద్ర ప్రాముఖ్యతను నొక్కిచెప్తుంది.

రోగులు రాత్రివేళ చక్కని నిద్ర పొందేందుకు స్లీప్‌ కోచ్‌ అసిస్టెన్స్‌ను రెస్‌మెడ్‌ ప్రవేశపెట్టింది. ఇది నిద్ర రుగ్మతలు ఉన్న రోగులకు వారి నిద్రయానంలో ప్రతీ దశను దూరప్రాంతం నుంచి దిశానిర్దేశం చేస్తుంది. ఇంటిలోనే స్లీప్‌ టెస్ట్‌ నిర్వహించి నిద్రలేమిని గుర్తించడం అలా నిద్రలేమిని గుర్తించిన రోగులకు అందుబాటులో ఉన్న సీపీఎపీ (కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌)చికిత్స అవకాశాలు వివరించడంతో పాటు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా డివైస్‌లు ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేయడం, ఆ డివైస్‌లకు సంబంధించి ఈఎంఐ స్కీములు సహ సాధ్యమైన ఉత్తమ ఆఫర్లు అందించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

“ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో చైతన్యం పెరుగుతున్న కొద్ది ఆహారమార్పులు, నిత్య వ్యాయామాలు, మానసిక ఆరోగ్యం వంటివాటికి ప్రాధాన్యత అధికమవుతోంది.కాని చక్కని ఆరోగ్యానికి కీలకంగా దోహదపడే నిద్రకు అంత ప్రాధాన్యత లభించడం లేదని” అంటారు రెస్‌మెడ్‌ ఆసియా, లాటిన్‌ అమెరికా నేషనల్‌ మార్కెటింగ్‌ హెడ్‌ సీమా అరోరా. “భారతదేశం లాంటి భౌగోళికంగా విస్తరమైన దేశంలో దేశంలో నిద్ర అవగాహనపై చర్చ చాలా తక్కువ స్థాయిలో ఉంది. 130 కోట్ల జనాభాకు వేళ్లపై లెక్కించే సంఖ్యలో స్లీప్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. స్లీప్‌ థెరపీలో అగ్రగామిగా ఉన్న రెస్‌మెడ్‌ ఈ అవగాహన కార్యక్రమం ద్వారా భారతీయుల్లో ముఖ్యంగా వైద్య సిబ్బందిలో చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తుంది. నిద్రరుగ్మతలు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తూ “నిద్ర సరిగ్గా ఉంటేనే రోజు సరిగ్గా ఉంటుందనే” సాధారణ ఆలోచనకు ఇది ప్రాముఖ్యతనిస్తుంది”.

వైద్యసిబ్బందికి నిద్ర అవగాహన, చైతన్యం పెంచే కృషిలో భాగంగా డాక్టర్‌ మాన్వీర్‌ భాటియా, ఆమెకు చెందిన స్లీప్‌ సొసైటీ- ఎఎస్‌ఎస్‌ఎం ఏస్‌ స్కూల్‌ ఆఫ్‌ స్లీప్‌ సైన్స్‌, డాక్టర్‌ సుజిత్‌ రాజన్‌ వంటి దేశంలోనే నిద్ర నిపుణులుగా పేరుగాంచిన ప్రముఖులతో వెబ్‌-ఎడ్యుకేషన్‌ సిరీస్‌ను రెస్‌మెడ్‌ నిర్వహిస్తోంది. ఈ దిశగా మే 2020 నుంచి 700 లకు పైగా డాక్టర్లకు రెస్‌మెడ్‌ సర్టిఫికేట్లు ప్రదానం చేసింది.

“ఐదు నుంచి పది శాతం మంది భారతీయులు నిద్రసంబంధమైన లోపాలతో బాధపడుతూ ఉంటారు, కాని ఆ ప్రభావం వారి ఆరోగ్యంపై ఎలా ఉంటుందనే విషయం వారికి తెలియదని” ప్రముఖ భారతీయ స్లీప్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మాన్వీర్‌ భాటియా తెలిపారు. “జీవితంలో మనం ముఫ్పై శాతం సమయాన్ని నిద్రలో గడుపుతాం, అది మన నిత్య విశ్రాంతి ఉద్దేశాలకు మించి ఉంటుంది.  అది మన శరీరానికి సాంత్వన అందిస్తూ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు దోహదపడుతుంది. నిద్రకు సంబంధించిన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్ర అన్నది మనం చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు చాలా ముఖ్యమైనదని, అది ఇతర వైద్యరుగ్మతలతో ముడిపడి ఉంటుందని తెలుసుకోవాలి. వైద్యులతో శిక్షణా కార్యక్రమాలు, ప్రజావగాహన ప్రచారాలు, స్లీప్‌ కోచ్‌ సాయం ద్వారా ఈ అవగాహన పెంచవచ్చు. ఈ చర్యల ద్వారా  చక్కని నిద్రకున్న ప్రాధాన్యత ప్రభావాన్ని తెలుసుకోవచ్చని” ఆమె అన్నారు.

భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారిన ఈ పరిస్థితుల్లో రోగుల సంరక్షణ కోసం హాస్పిటల్స్‌ అవసరం లేకుండా రెస్‌మెడ్స్‌ సృజనాత్మక, కనెక్టెడ్‌ స్లీప్‌ సొల్యూషన్స్‌ రోగులు, డాక్టర్లను అనుసంధానం చేస్తాయి. ఈ నెట్‌వర్క్‌ పరిధిలోని 10 మిలియన్లకు పైగా ఉన్న క్లౌడ్‌ కనెక్టబుల్‌ డివైస్‌ల ద్వారా దూరప్రాంతం నుంచే రోగులను డాక్టర్లు పర్యవేక్షించగలుగుతారు. అంతే కాదు రోగులు కూడా తమ ఆరోగ్యసంబంధమైన సమాచారాన్ని తెలియజేసుకొని  నిద్రసమస్యల కోసం పరీక్షలు చేయించుకొని చికిత్స పొందవచ్చు.

స్లీప్‌ కోచ్‌ అసిస్టెన్స్‌ లేదా స్లీప్‌ టెస్ట్‌  చేయించుకునేందుకు ఇప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-103-3969కు కాల్‌ చేయండి. (అడ్వటోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement