Good sleep
-
హాయిగా నిద్రపోతున్నారా?
చిన్న పిల్లలకి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర వారి ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాదు.. వారిలో రోగనిరోధక శక్తిని, మేధాశక్తిని పెంచుతుంది. ⇒నిద్రకు ఒక సమయాన్ని కేటాయించడం మంచిది. ఇది వాళ్ళ స్లీప్ సైకిల్ని క్రమబద్ధపరచడమే కాకుండా పిల్లల్ని మరింత శక్తిమంతంగా తయారు చేస్తుంది. వేళకు పడుకోవడం.. లేవడం అందరికీ అవసరమే. ⇒సుఖ నిద్రకు ప్రతిరోజూ చేసే క్రమానుసార పనులు ఎంతగానో దోహదపడతాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంపుదలకు దోహదపడుతుంది.⇒పడుకునే ముందు స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, నైట్ డ్రెస్ వేసుకోవడం, కథలు వింటూనో, చెబుతూనో నిద్ర΄ోవడం.. పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వారికి బంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడానికీ ఉపకరిస్తుంది. ⇒పరిపూర్ణ నిద్రకి, పడకగదికి అవినాభావ సంబంధం ఉంది. పరిశుభ్రమైన పడకగది ఆరోగ్యమైన నిద్రతో పాటు అన్నిరకాల అనారోగ్యాలనూ దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ గాడ్జెట్స్‌ను, టివీ వంటి వాటిని పడకగదిలో లేకుండా చేయడం ద్వారా మగతనిద్రను దూరం చేయవచ్చు. ⇒పడుకునే ముందు జంక్ ఫుడ్ తినడం, కాఫీ తాగడం నిద్రాభంగం కలిగిస్తుంది. వీలైనంత వరకూ రాత్రి భోజనంలో పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తినడం మంచిది. -
గురకతో ఇబ్బందా.. చిట్టి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి!
కుంభకర్ణుడి కాలం నుంచి ఇప్పటివరకు పక్కన పడుకునేవాళ్లను దారుణంగా ఇబ్బంది పెట్టేది గురక! సాధారణంగా మనం పీల్చుకునే గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది. నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే మన గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు శ్వాస ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది కాబట్టి ఎలాంటి శబ్దమూ రాదు. రిలాక్స్ అయిన కండరాల కారణంగా ఫ్లాపీగా అయి గాలి తీసిన ట్యూబులా ఉన్న శ్వాసనాళంలోంచి గాలి ప్రయాణం చేసేప్పుడు అది తగిలిన మన అంగిలి ప్రకంపనలకు గురవుతాయి. అలా ప్రకంపనలు రేగడం వల్ల శబ్దం వస్తుంది. అదే గురక! రకాలున్నాయి.. కొన్నిసార్లు కుంచించుకుపోయిన శ్వాసనాళం అలా కాసేపు మూసుకుపోయి ఉండిపోతుంది. అలా కొద్దిసేపు మాత్రమే ఉంటే దాన్ని హైపాప్నియా అంటారు. కానీ అలా మూసుకుపోయిన స్థితి (కండిషన్) చాలాసేపు కొనసాగితే గాన్ని ‘ఆప్నియా’ అంటారు. గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. గురక ఉండటం తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితే. చాలా సందర్భాల్లో హైపాప్నియా, ఆప్నియా కండిషన్లు అంత ప్రమాదకరం కాకపోవచ్చేమోగానీ... ఒక్కోసారి మాత్రం ఆప్నియా వల్ల చాలాసేపు గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆప్నియా ఉంటే అశ్రద్ధ చేయకూడదు. అది గుండెకు మంచిది కాదు. పడుకునే తీరు సరిగాలేకపోయినా గురక వస్తుంది. ఎవరికి ఎక్కువ డేంజర్... పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నవారికి గురక డేంజర్‌గా మారుతుంది. స్థూలకాయులకు గురక సమస్య ఉంటే వారికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్లీప్ అప్నియా వల్ల వచ్చే సున్నితమైన ముఖ్యమైన సమస్య గురక. గురకపెట్టి నిద్రపోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి గాఢనిద్ర కాదు కదా మామూలుగా కూడా వాళ్లు నిద్రపోవడంలేదనే చెప్పాలి. స్లీప్ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక,సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. గురక తీవ్రమైతే జబ్బుగానే పరిగణించాలి. కాంప్లికేషన్లు ఏవీ లేనప్పుడు గురక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. కానీ స్లీప్ అప్నియా వల్ల వచ్చే గురక దీర్ఘకాలం ఉంటుంది. గురకతోపాటు బీపీ, షుగర్, ఊబకాయం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. నివారణ లేదా? సరైన ఆహారం తీసుకోవడం, సరైన బీఎంఐ మెయిటెన్ చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వంటివి గురకను నివారిస్తాయి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు నిద్రకు ఉపక్రమించడానికి నాలుగు నుంచి ఆరు గంటల ముందు వరకు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి గురక ఉంటే, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం గుర్తించవచ్చు. అందుకే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడమే మంచిది. గురకవచ్చే వారు ఒకసారి డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించి అది ప్రమాదరహితమైన మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి సీపాప్ వంటి ఉపకరణాలు వాడటమో లేదా ఈఎన్టీ, పల్మునాలజిస్టులు చెప్పే సూచనలు పాటించడం, చికిత్స చేయించుకోవడం అవసరం. చిట్టి చిట్కాలు.. ఆరోగ్యవంతమైన జీవనశైలే సుఖ నిద్రకు ముఖ్యం. పైన చెప్పుకున్నట్లు క్రమబద్దమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి పడుకోవాలి. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపిస్తే పడుకునే ముందు నేసల్ డ్రాప్స్ వేసుకోవాలి. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ పూర్తిచేయాలి. రాత్రిపూట వ్యాయామం,వాకింగ్ వంటి చేయకూడదు. అలాగే రాత్రి వేళల్లో కాఫీటీల జోలికి అస్సలు వెళ్లకూడదు. అర టీస్పూన్ తేనెలో మరో అరటీస్పూన్ ఆలీవ్ ఆయిల్ కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో రెండు చుక్కలు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి పడుకునే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే గురక తగ్గుముఖం పడుతుంది. ఒక గ్లాసు వేడినీటిలో అర టీస్పూన్ యలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్యనుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. పడుకునేముందు మరిగే నీటిలో ఐదుఆరు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా తరచూ చేస్తే గురక తగ్గుతుంది. వెల్లుల్లిని వాసన చూడడం ద్వారా శ్వాసనాళ తాత్కాలిక ఇబ్బందిని దూరం చేసి గురకను నివారించవచ్చు. చదవండి: Cyber Crime: ఫోన్లోనే పరిచయం, చాటింగ్.. అమెరికా వెళ్దామని.. -
మంచి నిద్ర కోసం చేయాల్సినవి ఇవే...
మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... ►పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. ►బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. ►నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ►సాయంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి. ►రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ►ప్రతిరోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపోవాలి. ►పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. ►రాత్రి బాగా నిద్ర పట్టాలంటే రోజూు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు. ►గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. ►నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయవద్దు. ►నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. -
మంచి నిద్రతో మెదడుకు మేత!
సాక్షి, హైదరాబాద్: రోజూ ప్రశాంత వాతావరణంలో అంతరాయం లేని మంచి నిద్ర పోవడం చాలా మంచిదని బామ్మలు, పెద్దవాళ్లు చెబుతూ వస్తున్నదే. అయితే మంచి నిద్రలో మెరుగైన ఆరోగ్యంతో పాటు మన ‘మెదడు ఆరోగ్యానికి’కూడా ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలిందని చెబుతున్నారు. మంచి నిద్రతో మెదడులోని మలినాలు, విషపూరితంగా మారే ప్రోటీన్లు దూరం అవుతాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఆరోగ్యవంతమైన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల (న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్) బారిన పడే అవకాశాలున్నాని చెబుతున్నారు. (చదవండి: రాదేమి కునుకు!) ‘మలినాల ను తొలగించడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు నరాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇలా మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంతస్థాయిలో జరుగుతున్నా మంచి, దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతోంది’ అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డా. రవి అల్లాడా వెల్లడించారు. మానవులు మొదలుకుని జంతువులు, పక్షులు, ఫలాలపై వాలే దోమల్లో నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. మంచి నిద్రకు సూత్రాలు.. పొద్దునే నడక, చిన్నపాటి వ్యాయామం. మంచంపై ల్యాప్‌టాప్‌లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించాలి. రాత్రిళ్లు మితంగా తినాలి. నిద్రకు రెండు, 3 గంటల ముందు ఎక్కువగా తినొద్దు. మద్యం, కాఫీ, టీ, చాక్లెట్లు రాత్రి తీసుకోరాదు. æ రాత్రి సమయాల్లో నీలం కాంతి లైట్లకు దూరంగా ఉండాలి. -
నిద్రలేమిని గుర్తించడం ఎలా?
#WakeUpToGoodSleep ప్రచారం ద్వారా మంచి నిద్ర ప్రాధాన్యతను తెలియజెప్తున్న రెస్‌మెడ్ నిద్ర రుగుత్మలపై వైద్యులు, వినియోగదారులను చైతన్యపరచనున్న ఈ డిజిటల్ ప్రచారం న్యూదిల్లీ: 17 నవంబర్, 2020- డిజిటల్ హెల్త్, సంబంధిత (నిద్ర, శ్వాససంరక్షణ) పరికరాల్లో ప్రపంచ అగ్రగామి రెస్‌మెడ్ (ResMed) సరికొత్త నిద్ర అవగాహన ప్రచారం #WakeUpToGoodSleepను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యంగా ఉండేందుకు చక్కని నిద్రకున్న ప్రాధాన్యతను, భారతదేశంలో పెరుగుతున్న, గుర్తించని నిద్ర రుగ్మతలను వివరించడమే కాకుండా వాటి చికిత్సకు అందుబాటులో ఉన్నఅవకాశాలను ఈ ప్రచారం నొక్కిచెప్తుంది. నేడు, లక్షలమంది భారతీయులు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారు, కాని అందులో చాలా మటుకు గుర్తించడడం జరగదు. 2019లో ల్యాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో లక్షలాది మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ నిద్ర రుగ్మతలను చక్కదిద్దకుండా వదిలేస్తే అది గుండెపోటు, డయాబెటిస్, డిప్రెషన్ సహ మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదకారిగా పరిణమించవచ్చు. ఇవన్నీ నిద్రరుగ్మతలపై అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నాయి. వినియోగదారులు, డాక్టర్లకు అవగాహన పెంచేలా ఈ ప్రచారం తోడ్పడుతుంది. ఈ ప్రచారంలో భాగంగా చిన్న అవగాహన చిత్రాన్నిరెస్‌మెడ్ ఆవిష్కరించింది. ఇది నిద్రలేమి, అంతగా తెలియని నిద్ర రుగ్మతలు, అలసట, మానసిక ఒత్తిడి, చికాకు, ట్రాఫిక్ ప్రమాదాల వంటి వాటి ప్రభావాలను తెలియజెప్తూ రాత్రివేళ మంచి నిద్ర ప్రాముఖ్యతను నొక్కిచెప్తుంది. రోగులు రాత్రివేళ చక్కని నిద్ర పొందేందుకు స్లీప్ కోచ్ అసిస్టెన్స్‌ను రెస్‌మెడ్ ప్రవేశపెట్టింది. ఇది నిద్ర రుగ్మతలు ఉన్న రోగులకు వారి నిద్రయానంలో ప్రతీ దశను దూరప్రాంతం నుంచి దిశానిర్దేశం చేస్తుంది. ఇంటిలోనే స్లీప్ టెస్ట్ నిర్వహించి నిద్రలేమిని గుర్తించడం అలా నిద్రలేమిని గుర్తించిన రోగులకు అందుబాటులో ఉన్న సీపీఎపీ (కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్)చికిత్స అవకాశాలు వివరించడంతో పాటు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా డివైస్‌లు ఉచితంగా ఇన్స్టాల్ చేయడం, ఆ డివైస్‌లకు సంబంధించి ఈఎంఐ స్కీములు సహ సాధ్యమైన ఉత్తమ ఆఫర్లు అందించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. “ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో చైతన్యం పెరుగుతున్న కొద్ది ఆహారమార్పులు, నిత్య వ్యాయామాలు, మానసిక ఆరోగ్యం వంటివాటికి ప్రాధాన్యత అధికమవుతోంది.కాని చక్కని ఆరోగ్యానికి కీలకంగా దోహదపడే నిద్రకు అంత ప్రాధాన్యత లభించడం లేదని” అంటారు రెస్‌మెడ్ ఆసియా, లాటిన్ అమెరికా నేషనల్ మార్కెటింగ్ హెడ్ సీమా అరోరా. “భారతదేశం లాంటి భౌగోళికంగా విస్తరమైన దేశంలో దేశంలో నిద్ర అవగాహనపై చర్చ చాలా తక్కువ స్థాయిలో ఉంది. 130 కోట్ల జనాభాకు వేళ్లపై లెక్కించే సంఖ్యలో స్లీప్ ల్యాబ్స్ ఉన్నాయి. స్లీప్ థెరపీలో అగ్రగామిగా ఉన్న రెస్‌మెడ్ ఈ అవగాహన కార్యక్రమం ద్వారా భారతీయుల్లో ముఖ్యంగా వైద్య సిబ్బందిలో చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తుంది. నిద్రరుగ్మతలు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తూ “నిద్ర సరిగ్గా ఉంటేనే రోజు సరిగ్గా ఉంటుందనే” సాధారణ ఆలోచనకు ఇది ప్రాముఖ్యతనిస్తుంది”. వైద్యసిబ్బందికి నిద్ర అవగాహన, చైతన్యం పెంచే కృషిలో భాగంగా డాక్టర్ మాన్వీర్ భాటియా, ఆమెకు చెందిన స్లీప్ సొసైటీ- ఎఎస్‌ఎస్‌ఎం ఏస్ స్కూల్ ఆఫ్ స్లీప్ సైన్స్, డాక్టర్ సుజిత్ రాజన్ వంటి దేశంలోనే నిద్ర నిపుణులుగా పేరుగాంచిన ప్రముఖులతో వెబ్-ఎడ్యుకేషన్ సిరీస్‌ను రెస్‌మెడ్ నిర్వహిస్తోంది. ఈ దిశగా మే 2020 నుంచి 700 లకు పైగా డాక్టర్లకు రెస్‌మెడ్ సర్టిఫికేట్లు ప్రదానం చేసింది. “ఐదు నుంచి పది శాతం మంది భారతీయులు నిద్రసంబంధమైన లోపాలతో బాధపడుతూ ఉంటారు, కాని ఆ ప్రభావం వారి ఆరోగ్యంపై ఎలా ఉంటుందనే విషయం వారికి తెలియదని” ప్రముఖ భారతీయ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ మాన్వీర్ భాటియా తెలిపారు. “జీవితంలో మనం ముఫ్పై శాతం సమయాన్ని నిద్రలో గడుపుతాం, అది మన నిత్య విశ్రాంతి ఉద్దేశాలకు మించి ఉంటుంది. అది మన శరీరానికి సాంత్వన అందిస్తూ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు దోహదపడుతుంది. నిద్రకు సంబంధించిన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్ర అన్నది మనం చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు చాలా ముఖ్యమైనదని, అది ఇతర వైద్యరుగ్మతలతో ముడిపడి ఉంటుందని తెలుసుకోవాలి. వైద్యులతో శిక్షణా కార్యక్రమాలు, ప్రజావగాహన ప్రచారాలు, స్లీప్ కోచ్ సాయం ద్వారా ఈ అవగాహన పెంచవచ్చు. ఈ చర్యల ద్వారా చక్కని నిద్రకున్న ప్రాధాన్యత ప్రభావాన్ని తెలుసుకోవచ్చని” ఆమె అన్నారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారిన ఈ పరిస్థితుల్లో రోగుల సంరక్షణ కోసం హాస్పిటల్స్ అవసరం లేకుండా రెస్‌మెడ్స్ సృజనాత్మక, కనెక్టెడ్ స్లీప్ సొల్యూషన్స్ రోగులు, డాక్టర్లను అనుసంధానం చేస్తాయి. ఈ నెట్వర్క్ పరిధిలోని 10 మిలియన్లకు పైగా ఉన్న క్లౌడ్ కనెక్టబుల్ డివైస్ల ద్వారా దూరప్రాంతం నుంచే రోగులను డాక్టర్లు పర్యవేక్షించగలుగుతారు. అంతే కాదు రోగులు కూడా తమ ఆరోగ్యసంబంధమైన సమాచారాన్ని తెలియజేసుకొని నిద్రసమస్యల కోసం పరీక్షలు చేయించుకొని చికిత్స పొందవచ్చు. స్లీప్ కోచ్ అసిస్టెన్స్ లేదా స్లీప్ టెస్ట్ చేయించుకునేందుకు ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1800-103-3969కు కాల్ చేయండి. (అడ్వటోరియల్) -
కంటినిండా నిద్రకు కుంకుమ పువ్వు
ఎంత ప్రయత్నించినా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? తెల్లవార్లూ మంచంపై పొర్లుదండాలు పెడుతున్నారా? కంటినిండా నిద్రపోవాలంటే ఏం చేయాలో చెప్పండర్రా అని అందరినీ అడుగుతున్నారా? చాలా సింపుల్. కాసింత కుంకుమపువ్వు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డాక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థం ఒకటి నిద్రకు బాగా ఉపకరిస్తుందని వీరు ప్రయోగపూర్వకంగా గుర్తించారు. పద్దెనిమిది ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యవయస్కులు కొందరిని ఎంపిక చేసి వారిలో కొందరికి రోజూ 14 మిల్లీగ్రాముల కుంకుమపువ్వు నుంచి తీసిన పదార్థాన్ని ఇచ్చారు. మిగలిన వారికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. వీరందరికీ నిద్రలేమి సమస్యలు ఉన్నాయని, ముందుగానే తెలుసు. అంతేకాకుండా వీరు ఏ రకమైన మందులు తీసుకోవడం లేదు. నాలుగు వారాల పాటు జరిగిన పరీక్ష తరువాత పరిశీలించినప్పుడు కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడుతున్న వారికి మెరుగైన నిద్ర పడుతున్నట్లు తెలిసింది. ఏడు రోజుల తరువాతి నుంచే తమ నిద్ర నాణ్యతలో మెరుగుదల కనిపించిందని ప్రయోగంలో పాల్గొన్న వారు చెప్పారు. పైగా కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడటం ద్వారా ఎలాంటి దుష్ప్రభావమూ కనిపించలేదు కూడా. ఇప్పుడు మరింత విస్తత స్థాయిలో మరోసారి ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను నిర్ధారించుకుంటామని అడ్రియన్ లోప్రెసెటీ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
మంచి నిద్రతో ఆరోగ్యం.. కారణం తెలిసింది!
కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. కారణమేమిటన్నది మాత్రం తెలియదు. ఈ లోటును భర్తీ చేశారు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా, నిద్రలేమికి – ఎముక మజ్జలో తెల్లరక్తకణాల ఉత్పత్తికి మధ్య సంబంధం ఉందని గుర్తించామని ఫిలిప్ స్విర్స్కీ అనే శాస్త్రవేత్త తెలిపారు. తెల్ల రక్తకణాలు శరీరంలో మంట/వాపులకు కారణమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా మనం మెలకువగా ఉండేందుకు ఉపయోగపడే మెదడులోని ఒక రసాయనం కూడా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నిద్రలేమికి – రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు వచ్చేందుకు మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు తాము ఎలుకలపై ప్రయోగాలు చేశామని చెప్పారు. తరచూ నిద్రాభంగానికి గురయ్యే ఎలుకల రక్తనాళాలల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతున్నట్లు, బరువు, కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ మోతాదులతో సంబంధం లేకుండా ఇది జరుగుతున్నట్లు స్పష్టమైందని ఫిలిప్ వివరించారు. దీంతోపాటు నిద్ర తక్కువైన ఎలుకల్లో తెల్ల రక్తకణాల ఉత్పత్తికి కారణమవుతున్న మూలకణాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని, మెదడులోని హైపోక్రెటిన్ రసాయనం కూడా తక్కువైనట్లు తెలిసిందని చెప్పారు. గుండెజబ్బుల నివారణకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని అంచనా. -
సుఖంగా నిద్ర పోవాలంటే.. ఇలా చేయండి
‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. ఇక ఉరుకుల పరుగుల ఉద్యోగాలు.. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్నారా..? అయితే పడుకునే ముందే ఈ ఆహారం తీసుకుంటే కుంభకర్ణుడిలా నిద్రపోవచ్చంటున్నారు.‘ ది గుడ్ స్లీప్ గైడ్’ రచయిత సామ్మి మార్గో. ట్రిప్టోఫాన్ అనే హర్మోన్ నిద్ర ఉపకరించేలా చేస్తుందని ఇది సహజంగా దొరికే ఐదు ఆహార పదార్దల్లో పుష్కలంగా లభిస్తుందని సామ్మి పేర్కొన్నాడు. అవి ఏమిటి అంటే 1. అరటి పండు 2. ఒక గ్లాసు పాలు 3. తేనే 4. బాదం 5. ఓట్స్ ఇక స్పైసీ పదర్థాలు, కాఫీ, టీ లాంటి డ్రింక్స్ అసలు తీసుకోకూడదని తెలిపారు సామ్మి. ♦ అరటిపండులో కార్భోహైడ్రెట్స్ శాతం ఎక్కువ. ఇవి మెదడులోని ట్రిప్టోఫాన్ హర్మోన్ ను ఉత్తేజపరుస్తాయి. అంతేగాకుండా తలత్రిప్పడాన్ని కూడ తగ్గిస్తాయి. ఇంకా అరటి పండులో పుష్కలముగా లభించే మెగ్నీషియం నరాలు, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. దీంతో సుఖంగా నిద్రపోవచ్చు. ♦ ఇక నిద్రకు ఉపకరించేముందు గ్లాసు వేడి పాలు తాగాలని మన పెద్దలు చెప్పిన విషయమే. ఇక పాలల్లో ట్రిప్టోఫాన్ హర్మోన్ ఉత్తేజపరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని సామ్మి పేర్కొన్నాడు. అంతేగాకుండా మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని, శరీరంలోని కాల్షియం కొరత లేకుండా చేస్తుందన్నారు. ♦ టేబుల్ స్పూన్ తేనేను నిద్రపోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. తేనేలో కూడా ట్రిప్టోఫాన్ ప్రేరేపించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ♦ రాత్రి వేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇక వేడి పాలల్లో ఓట్స్, తేనే, కలుపుకొని, అరటిపండుతో తీసుకుంటే ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా ఉంటారు. -
గుడ్ స్లీప్.. స్వీట్ డ్రీమ్స్
పొద్దుట్నుంచీ కంప్యూటర్‌కు అతుక్కుపోయిన కళ్లు రాత్రయినా మూతపడనంటున్నాయ్. రేపటి మీటింగ్లూ, ప్లాన్లతో వేడెక్కిపోయిన మెదడు ఆలోచనల చట్రం నుంచి బయటకు రానంటోంది. ఏసీలూ, కుషన్ సీట్ల పుణ్యాన అలసట రుచి ఎరుగని శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం లేదు. వెరసి.. కునుకు ప్రియమవుతోంది. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది అందని ద్రాక్షే అవుతోంది. అన్ని సౌకర్యాలు ఉండి కూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు, ఉన్నతోద్యోగులు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్ర కోసం మందే మందు అనుకునే మందుబాబులు, నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు కోకొల్లలు. అందుకే బ్యాంక్ బాలెన్సులున్న కుబేరుల కన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని అంటుంటారు. -విశాఖ కల్చరల్/ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) ‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న నగరవాసులు... ‘నిదురమ్మా... నువ్వెక్కడమ్మా..!’ అంటూ అన్వేషిస్తున్నారు. నిద్రాభంగానికి గురవుతున్న వారిలో వారు వీరని తేడా లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల దాకా, డిజైనర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. దీనికి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు... ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రమవుతుండడం, విజయాలు సాధించాలనే తపన, తరచుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడం... ఇలాంటి కారణాల వల్ల మెదడు సామర్థ్యానికి మించి పనిచేయాల్సి రావడం... వ్యక్తిని మానసికంగా తీవ్రమైన అశాంతికి గురిచేస్తున్నాయి. పొద్దస్తమానం అలజడికి అలవాటుపడిన మనసు మంచం ఎక్కగానే ఒక్కసారిగా మత్తులోకి జారిపోవడం కష్టం. మరోవైపు సమయానికి నిద్ర రాకపోతే రేపు లేవడం ఆలస్యమవుతుందని, పనులు సరిగా చేయలేమేమోననే ఆందోళన మరింతగా కునుకును దూరం చేస్తోంది. అలాగే శరీరానికి అవసరమైన కనీస శ్రమ లేకపోవడం, చెమట పట్టే పనులు చేయకపోవడం వల్ల రక్తప్రసరణ సమస్యలు ఏర్పడడం, విశ్రాంతి పొందాలనేంత పరిస్థితిని శరీరానికి కల్పించకపోవడం, టీవీలు, కంప్యూటర్లకు గంటల తరబడి కళ్లను అప్పగించడం... ఇవన్నీ మంచి నిద్రను దూరం చేసే కారణాలే. రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర380 రోడ్డు ప్రమాదాలను కేస్‌గా తీసుకుని ఇటీవల ఎయిమ్స్ ఓ స్టడీని నిర్వహించింది. వీటికి కారణమైన కమర్షియల్ డ్రైవర్స్‌కు నిద్ర వేళలు సరిగా లేవని గుర్తించారు. వీరిలో 60 శాతం మంది అంతకు ముందురోజు రాత్రి సరిగా నిద్రపోలేదని తేలింది. ఆరోగ్య నిద్రకు ఇవిగో మార్గాలు సాధారణంగా ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇది నిరంతరాయంగా ఈ నిద్ర నిరంతరాయంగా ఉండాలి. పగలు కాస్సేపు రాత్రి కాస్సేపు పడుకుని ఆరుగంటలు పడుకున్నాం కదా అని భావించకూడదు. కొందరు అంతరాయంగా నిద్రపోతుంటారు. తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తుంటారు. కొందరు వేకువజామున మరీ తొందరగా లేస్తుంటారు. ఏమైనప్పటికీ నిద్రను నిర్దిష్టసమయంలో బయోలాజికల్ క్లాక్లా అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. నిత్యజీవనంపై దీనిప్రభావం కనిపిస్తుంది. మానసిక శారీకర రుగ్మతలకు హేతవు అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు నిద్ర పట్టకుండా చేసే కాఫీ..టీలు పరిహరించాలి మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట భుజించ కూడదు. తేలికపాటి ఆహారం ఉత్తమం పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీలు చూడటం లాంటివి మంచివి కాదు. సాయంత్రం కాస్సేపు నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పడక గది కూడా మన అభిరుచికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రమాత్రలకు దూరంగా ఉంటే మంచిది. -డాక్టర్ ఎన్.ఎన్.రాజు మానసిక వైద్య నిపుణుడు సర్వేలు ఏం చెబుతున్నాయంటే.. తాజాగా ఏసీ నీల్సన్-ఫిలిప్స్ సంస్థలు విశాఖపట్నం, హైదరాబాద్‌తోసహా 25 నగరాలలో సర్వే నిర్వహించాయి. 35 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిర్వహించిన దీని ఫలితాల ప్రకారం... నగరాల్లో 93 శాతం మంది 8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. విచిత్రమేమిటంటే వీరిలో 2 శాతం మంది మాత్రమే తమ నిద్రలేమి గురించి వైద్యులతో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల 15 శాతం మంది ఏకాగ్రత లోపానికి గురవుతుంటే... 62 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా... అనే (నిద్ర కరవైతే వచ్చే అనారోగ్యం) సమస్య బారిన పడతున్నారు. నిద్ర సరిగా లేక తమ పని పాడవుతోందని వీరిలో 58 శాతం మంది అంటున్నారు. ఇక 11 శాతం మంది పనిచేసే సమయంలో నిద్ర కమ్మేస్తోందని అంటున్నారు. నిద్రపోయే సమయంలో 1 నుంచి 3 సార్లు మెలకువ వస్తోందని 72 శాతం మంది చెప్పడం ద్వారా తమది కలత నిద్ర అని చెప్పకనే చెప్పారు.