చిన్న పిల్లలకి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర వారి ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాదు.. వారిలో రోగనిరోధక శక్తిని, మేధాశక్తిని పెంచుతుంది.
⇒నిద్రకు ఒక సమయాన్ని కేటాయించడం మంచిది. ఇది వాళ్ళ స్లీప్ సైకిల్‌ని క్రమబద్ధపరచడమే కాకుండా పిల్లల్ని మరింత శక్తిమంతంగా తయారు చేస్తుంది. వేళకు పడుకోవడం.. లేవడం అందరికీ అవసరమే.
⇒సుఖ నిద్రకు ప్రతిరోజూ చేసే క్రమానుసార పనులు ఎంతగానో దోహదపడతాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంపుదలకు దోహదపడుతుంది.
⇒పడుకునే ముందు స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, నైట్ డ్రెస్ వేసుకోవడం, కథలు వింటూనో, చెబుతూనో నిద్ర΄ోవడం.. పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వారికి బంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడానికీ ఉపకరిస్తుంది.
⇒పరిపూర్ణ నిద్రకి, పడకగదికి అవినాభావ సంబంధం ఉంది. పరిశుభ్రమైన పడకగది ఆరోగ్యమైన నిద్రతో పాటు అన్నిరకాల అనారోగ్యాలనూ దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ గాడ్జెట్స్‌ను, టివీ వంటి వాటిని పడకగదిలో లేకుండా చేయడం ద్వారా మగతనిద్రను దూరం చేయవచ్చు.
⇒పడుకునే ముందు జంక్ ఫుడ్ తినడం, కాఫీ తాగడం నిద్రాభంగం కలిగిస్తుంది. వీలైనంత వరకూ రాత్రి భోజనంలో పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తినడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment