ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రోజూ ప్రశాంత వాతావరణంలో అంతరాయం లేని మంచి నిద్ర పోవడం చాలా మంచిదని బామ్మలు, పెద్దవాళ్లు చెబుతూ వస్తున్నదే. అయితే మంచి నిద్రలో మెరుగైన ఆరోగ్యంతో పాటు మన ‘మెదడు ఆరోగ్యానికి’కూడా ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలిందని చెబుతున్నారు. మంచి నిద్రతో మెదడులోని మలినాలు, విషపూరితంగా మారే ప్రోటీన్లు దూరం అవుతాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఆరోగ్యవంతమైన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల (న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్) బారిన పడే అవకాశాలున్నాని చెబుతున్నారు. (చదవండి: రాదేమి కునుకు!)
‘మలినాల ను తొలగించడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు నరాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇలా మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంతస్థాయిలో జరుగుతున్నా మంచి, దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతోంది’ అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డా. రవి అల్లాడా వెల్లడించారు. మానవులు మొదలుకుని జంతువులు, పక్షులు, ఫలాలపై వాలే దోమల్లో నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.
మంచి నిద్రకు సూత్రాలు..
- పొద్దునే నడక, చిన్నపాటి వ్యాయామం.
- మంచంపై ల్యాప్‌టాప్‌లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించాలి.
- రాత్రిళ్లు మితంగా తినాలి. నిద్రకు రెండు, 3 గంటల ముందు ఎక్కువగా తినొద్దు.
- మద్యం, కాఫీ, టీ, చాక్లెట్లు రాత్రి తీసుకోరాదు. æ రాత్రి సమయాల్లో నీలం కాంతి లైట్లకు దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment