సుఖంగా నిద్ర పోవాలంటే.. ఇలా చేయండి | 5 Foods You Should Have Before Bed to Get Good Sleep | Sakshi
Sakshi News home page

సుఖంగా నిద్ర పోవాలంటే.. ఇలా చేయండి

Published Thu, Jul 6 2017 4:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

సుఖంగా నిద్ర పోవాలంటే.. ఇలా చేయండి

సుఖంగా నిద్ర పోవాలంటే.. ఇలా చేయండి

 ‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. ఇక ఉరుకుల పరుగుల ఉద్యోగాలు.. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్నారా..? అయితే పడుకునే ముందే ఈ ఆహారం తీసుకుంటే కుంభకర్ణుడిలా నిద్రపోవచ్చంటున్నారు.‘ ది గుడ్ స్లీప్ గైడ్’ రచయిత సామ్మి మార్గో.   ట్రిప్టోఫాన్ అనే హర్మోన్ నిద్ర ఉపకరించేలా చేస్తుందని ఇది సహజంగా దొరికే  ఐదు ఆహార పదార్దల్లో పుష్కలంగా లభిస్తుందని సామ్మి పేర్కొన్నాడు. అవి ఏమిటి అంటే 1. అరటి పండు 2. ఒక గ్లాసు పాలు 3. తేనే 4. బాదం 5. ఓట్స్‌ ఇక స్పైసీ పదర్థాలు, కాఫీ, టీ లాంటి డ్రింక్స్‌ అసలు తీసుకోకూడదని తెలిపారు సామ్మి.


♦ అరటిపండులో కార్భోహైడ్రెట్స్‌ శాతం ఎక్కువ. ఇవి మెదడులోని ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ను ఉత్తేజపరుస్తాయి. అంతేగాకుండా తలత్రిప్పడాన్ని కూడ తగ్గిస్తాయి. ఇంకా అరటి పండులో పుష్కలముగా లభించే మెగ్నీషియం నరాలు, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. దీంతో సుఖంగా నిద్రపోవచ్చు.
♦ ఇక నిద్రకు ఉపకరించేముందు గ్లాసు వేడి పాలు తాగాలని మన పెద్దలు చెప్పిన విషయమే. ఇక పాలల్లో ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ఉత్తేజపరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని సామ్మి పేర్కొన్నాడు. అంతేగాకుండా  మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని, శరీరంలోని కాల్షియం కొరత లేకుండా చేస్తుందన్నారు.

♦ టేబుల్ స్పూన్ తేనేను నిద్రపోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. తేనేలో కూడా ట్రిప్టోఫాన్‌ ప్రేరేపించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

♦ రాత్రి వేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇక వేడి పాలల్లో ఓట్స్‌, తేనే, కలుపుకొని, అరటిపండుతో తీసుకుంటే ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement