
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్‌లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.
ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు.
‘జన్‌జన్‌కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment