
కొట్టి మరీ లేపుతుంది!
తెల్లారే లెగుద్దామని అలారం పెట్టుకోవడం.. అది గొంతు చించుకుని మోగినా.. నిద్రమత్తులో దాన్ని ఆపేసి.. మళ్లీ ముసుగుతన్నేయడం మనకు అలవాటే. తర్వాత.. అయ్యో.. లెగలేదే అని నాలుక్కరుచుకోవడం కూడా మనకు మామూలే. ఇలాంటి నాలుక్కరుచుకోవడాలు ఇకపై ఉండవు. ఎందుకంటే.. స్వీడన్‌కు చెందిన షిమోన్(ఫొటోలోని యువతి) వేకప్ మెషీన్ పేరిట ఈ అలారం క్లాక్‌ను తయారుచేసింది. అలారం పూర్తయ్యాక లేవకుంటే.. ఇది కొట్టిమరీ లేపుతుంది.
ఈ వేకప్ మెషీన్‌ను మనం పడుకున్న బెడ్ పైన ఇలా అమర్చుకోవాల్సి ఉంటుంది. అలారం పెట్టుకున్న సమయానికి ఠంఛనుగా ఇది మోగుతుంది. అలారం పూర్తయ్యాక లేవకుంటే.. ఇక పిచ్చకొట్టుడే.. దీన్ని ఇంకా మెరుగుపరచాల్సి ఉందని.. త్వరలోనే మార్కెట్లోకి తెస్తానని షిమోన్ చెబుతోంది.