ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం | Indian Railways Target To Implement Kavach System | Sakshi
Sakshi News home page

ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం

Published Mon, Jun 24 2024 6:40 PM | Last Updated on Mon, Jun 24 2024 7:47 PM

Indian Railways Target to implement Kavach System

టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్‌ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది.

ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్‌స్టాలేషన్‌ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement