సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త కూత వినిపించనుంది. రెండేళ్లలో ప్రైవేట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. 2023 మార్చి.. రైల్వే చరిత్రలో విప్లవాత్మక మార్పు అమలు కానుంది. తేజస్ లాంటి స్పెషల్ కేటగిరీ రైలును ప్రైవేటు సంస్థల ఆధ్వర్యం లో నడిపించనున్నారు. తొలిసారి ప్యాసింజర్ రైళ్లు ప్రైవేటు సర్వీసులుగా పట్టాలెక్కబోతున్నాయి. దేశ వ్యాప్తంగా 151 రైళ్లు ప్రైవేటుపరం కానున్నాయి. సికింద్రాబాద్ క్లస్టర్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో రైళ్లను ప్రైవేటు సంస్థలు నడపనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా ఊపి, దశలవారీగా మిగతా రూట్లలో అనుమతి ఇవ్వనుంది.
16 సంస్థలు.. 120 దరఖాస్తులు
జూలైలో ప్రైవేటీకరణ తొలిదశగా రిక్వెస్ట్ ఫర్ క్వా లిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తం గా 16 సంస్థలు వివిధ రూట్లకు సంబంధించి 120 దరఖాస్తులు సమర్పించాయి. తాజాగా వాటిని పరిశీలించిన రైల్వే అందులో 102 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌లో 9 సంస్థలు అర్హత సాధించినట్టు ప్రకటించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లకు దరఖాస్తులు ఆహ్వా నించనుంది. దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఈ రూపంలో సమకూర్చుకోవా లని రైల్వే భావిస్తోంది. ఏ సంస్థ ఎంతమేర ఆదా యాన్ని రైల్వేకు ఇచ్చేందుకు ముందుకొస్తుందన్న విషయం ఫైనాన్షియల్ బిడ్ల ద్వారా తేలుతుంది. అందులో ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలను ప్రైవేటు రైళ్లు నిర్వహించేందుకు గుర్తిస్తూ రైల్వే చివరి నోటిఫికేషన్ జారీ చేయనుంది.
(చదవండి: ‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ)
సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో ప్రైవేటు రైళ్లివే..
సికింద్రాబాద్– శ్రీకాకుళం వయా విశాఖపట్నం సికింద్రాబాద్–తిరుపతి, గుంటూరు–సికింద్రా బాద్, గుంటూరు–కర్నూలు సిటీ, తిరుపతి–వార ణాసి వయా సికింద్రాబాద్ సికింద్రాబాద్–ముంబై, ముంబై–ఔరంగాబాద్ విశాఖపట్టణం–విజయ వాడ, విశాఖపట్టణం–బెంగళూరు వయా రేణి గుంట, హౌరా–సికింద్రాబాద్, సికింద్రాబాద్– పాండిచ్చేరి వయా చెన్నై
అర్హత టెండర్లలో ఎంపికైన సంస్థలు ఇవే..
1. క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., 2. గేట్‌వే రైల్ ప్రై.లి., గేట్‌వే డిస్ట్రిపార్క్స్ లిమిటెడ్‌ల కన్సార్షియం, 3. జీఎమ్మార్ హైవేస్ లి., 4. ఐఆర్‌సీటీసీ, 5.ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లి., 6.ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ లి., 7.మాలెంపాటి పవర్ ప్రై.లి., టెక్నో ఇన్‌ఫ్రా డెవెలపర్స్ ప్రై.లిమిటెడ్ల కన్సార్షియం, 8. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లి., 9 వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్. ప్రస్తుతం రైల్వే నడుపుతున్న సర్వీసుల్లోంచే వీటిని ప్రైవేటు సంస్థ లకు కేటాయించనుంది. ప్రైవేటు సంస్థలు సొంతం గా రైల్ రేక్స్ సమకూర్చుకుని వీటిని తిప్పుతాయి.
సొంత చార్జీలు..
తాము నడిపే రైళ్లకు ఆయా సంస్థలు సొంతం గా చార్జీలు ఏర్పాటు చేసుకోనున్నాయి. రైల్వే అ నుమతించిన మేర వాటిని పెంచుకుని వసూలు చేసుకుంటాయి. ఆధునిక బోగీలు, వసతులు, వేగం, పరిశుభ్రత, భోజనం నాణ్య త... తదితరాల ఆధారంగా చార్జీలు నిర్ణయిం చనున్నారు. ఇవి ప్రస్తుత రైలు చార్జీల కంటే ఎక్కువగా ఉండనున్నాయి. విదేశాల నుంచి కూడా లోకోమోటివ్ ఇంజిన్లు, బోగీలు దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉండటంతో కొత్త తరహా రైళ్లు పట్టాలపై పరుగుపెట్టే అవకా శముంది. స్టేషన్లు, సిగ్నళ్లు అన్నీ రైల్వే అధీనంలోనే ఉంటాయి. వాటిని, విద్యుత్తును వినియోగించు కున్నందుకు ఆయా సంస్థలు రైల్వేకు ప్రత్యేక చార్జీలను చెల్లించనున్నాయి.
(చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్‌న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment