private trains
-
పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
-
‘ప్రైవేటు’ చుక్‌చుక్‌కి.. చకచకా ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త కూత వినిపించనుంది. రెండేళ్లలో ప్రైవేట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. 2023 మార్చి.. రైల్వే చరిత్రలో విప్లవాత్మక మార్పు అమలు కానుంది. తేజస్ లాంటి స్పెషల్ కేటగిరీ రైలును ప్రైవేటు సంస్థల ఆధ్వర్యం లో నడిపించనున్నారు. తొలిసారి ప్యాసింజర్ రైళ్లు ప్రైవేటు సర్వీసులుగా పట్టాలెక్కబోతున్నాయి. దేశ వ్యాప్తంగా 151 రైళ్లు ప్రైవేటుపరం కానున్నాయి. సికింద్రాబాద్ క్లస్టర్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో రైళ్లను ప్రైవేటు సంస్థలు నడపనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా ఊపి, దశలవారీగా మిగతా రూట్లలో అనుమతి ఇవ్వనుంది. 16 సంస్థలు.. 120 దరఖాస్తులు జూలైలో ప్రైవేటీకరణ తొలిదశగా రిక్వెస్ట్ ఫర్ క్వా లిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తం గా 16 సంస్థలు వివిధ రూట్లకు సంబంధించి 120 దరఖాస్తులు సమర్పించాయి. తాజాగా వాటిని పరిశీలించిన రైల్వే అందులో 102 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించింది. సికింద్రాబాద్ క్లస్టర్లో 9 సంస్థలు అర్హత సాధించినట్టు ప్రకటించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లకు దరఖాస్తులు ఆహ్వా నించనుంది. దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఈ రూపంలో సమకూర్చుకోవా లని రైల్వే భావిస్తోంది. ఏ సంస్థ ఎంతమేర ఆదా యాన్ని రైల్వేకు ఇచ్చేందుకు ముందుకొస్తుందన్న విషయం ఫైనాన్షియల్ బిడ్ల ద్వారా తేలుతుంది. అందులో ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలను ప్రైవేటు రైళ్లు నిర్వహించేందుకు గుర్తిస్తూ రైల్వే చివరి నోటిఫికేషన్ జారీ చేయనుంది. (చదవండి: ‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ) సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో ప్రైవేటు రైళ్లివే.. సికింద్రాబాద్– శ్రీకాకుళం వయా విశాఖపట్నం సికింద్రాబాద్–తిరుపతి, గుంటూరు–సికింద్రా బాద్, గుంటూరు–కర్నూలు సిటీ, తిరుపతి–వార ణాసి వయా సికింద్రాబాద్ సికింద్రాబాద్–ముంబై, ముంబై–ఔరంగాబాద్ విశాఖపట్టణం–విజయ వాడ, విశాఖపట్టణం–బెంగళూరు వయా రేణి గుంట, హౌరా–సికింద్రాబాద్, సికింద్రాబాద్– పాండిచ్చేరి వయా చెన్నై అర్హత టెండర్లలో ఎంపికైన సంస్థలు ఇవే.. 1. క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., 2. గేట్‌వే రైల్ ప్రై.లి., గేట్‌వే డిస్ట్రిపార్క్స్ లిమిటెడ్‌ల కన్సార్షియం, 3. జీఎమ్మార్ హైవేస్ లి., 4. ఐఆర్సీటీసీ, 5.ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లి., 6.ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లి., 7.మాలెంపాటి పవర్ ప్రై.లి., టెక్నో ఇన్ఫ్రా డెవెలపర్స్ ప్రై.లిమిటెడ్‌ల కన్సార్షియం, 8. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లి., 9 వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ప్రస్తుతం రైల్వే నడుపుతున్న సర్వీసుల్లోంచే వీటిని ప్రైవేటు సంస్థ లకు కేటాయించనుంది. ప్రైవేటు సంస్థలు సొంతం గా రైల్ రేక్స్ సమకూర్చుకుని వీటిని తిప్పుతాయి. సొంత చార్జీలు.. తాము నడిపే రైళ్లకు ఆయా సంస్థలు సొంతం గా చార్జీలు ఏర్పాటు చేసుకోనున్నాయి. రైల్వే అ నుమతించిన మేర వాటిని పెంచుకుని వసూలు చేసుకుంటాయి. ఆధునిక బోగీలు, వసతులు, వేగం, పరిశుభ్రత, భోజనం నాణ్య త... తదితరాల ఆధారంగా చార్జీలు నిర్ణయిం చనున్నారు. ఇవి ప్రస్తుత రైలు చార్జీల కంటే ఎక్కువగా ఉండనున్నాయి. విదేశాల నుంచి కూడా లోకోమోటివ్ ఇంజిన్లు, బోగీలు దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉండటంతో కొత్త తరహా రైళ్లు పట్టాలపై పరుగుపెట్టే అవకా శముంది. స్టేషన్లు, సిగ్నళ్లు అన్నీ రైల్వే అధీనంలోనే ఉంటాయి. వాటిని, విద్యుత్తును వినియోగించు కున్నందుకు ఆయా సంస్థలు రైల్వేకు ప్రత్యేక చార్జీలను చెల్లించనున్నాయి. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్‌న్యూస్) -
‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కూడా పాల్గొన్నది. పీపీపీ విధానంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్/ఆర్ఎఫ్పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్ఎఫ్పీ పత్రాలు 2020 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తోపాటు.. జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, అరవింద్ ఏవియేషన్, బీహెచ్ఈఎల్, కన్స్ట్రక్షన్స్ వై ఆక్సిలర్ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్ఏ, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3, గేట్‌వే రైల్ ఫ్రయిట్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, సాయినాథ్ సేల్స్ అండ్ సర్వీసెస్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఆర్‌ఎఫ్‌క్యూలు సమర్పించాయి. -
ప్రైవేట్ రైళ్లలో చార్జీలపై పరిమితి లేదు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ చార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చార్జీలపై నిర్ణయం ప్రైవేట్ సంస్థలదేనని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లను 35 ఏళ్లపాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల విషయంలో ప్రైవేట్ బిడ్డర్లు పలు సందేహాలు లేవనెత్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ప్రైవేట్ సంస్థలే చార్జీలను నిర్ధారించవచ్చని తాజాగా రైల్వే శాఖ తెలియజేసింది. రైల్వేస్ యాక్ట్ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లేదా పార్లమెంట్ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా రైలు చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి. ప్రైవేట్ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ చార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలు సొంతంగానే తమ వెబ్సైట్ల ద్వారా రైల్ టికెట్లు అమ్ముకోవచ్చు. కానీ, ఈ వెబ్సైట్లను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ఈ–ఆఫీస్ జోరు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ 4 నెలలుగా ఈ–ఆఫీస్‌కు పెద్దపీట వేస్తోంది. పత్రాలు, ఫైళ్లను డిజిటల్ రూపంలోకి మార్చేసి, ఆన్లైన్లోనే పంపించింది. లేఖలు, బిల్లులు, ఆఫీస్ ఆర్డర్లు వంటి 12 లక్షలకు పైగా డాక్యుమెంట్లను, మరో 4 లక్షల ఫైళ్లకు డిజిటల్ రూపం కల్పించారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రైల్వే శాఖ ఆన్లైన్లో 4.5 లక్షల ఈ–రసీదులు జారీ చేయగా, 2020లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 16.5 లక్షల ఈ–రసీదులను జారీ చేసింది. ఈ–ఫైళ్ల సంఖ్య 1.3 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగింది. -
2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి 151 ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 151 ప్రైవేట్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
రైల్వేలో ‘ప్రైవేట్’ కూత
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ రైళ్లకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం పలు మార్గాల్లో ఐఆర్సీటీసీ నడుపుతున్న తేజాస్ రైళ్ల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు చెందిన రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, పారదర్శక రైల్వే సదుపాయాన్ని అందజేసేందుకే ప్రైవేట్ రైళ్లకు అనుమతినిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటుచేసి, 109 మార్గాలను ఖరారు చేశారు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ క్లస్టర్లో 10 మార్గాల్లో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. వీటిలో ముంబై– ఔరంగాబాద్, విశాఖ–విజయవాడ రైళ్లు మినహా మిగతావి సికింద్రాబాద్ కేంద్రంగానే రాకపోకలు సాగించనున్నాయి. త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక టెండర్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు బడా ప్రైవేట్ వ్యాపార సంస్థలు, కన్సార్షియంల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని అంచనా. డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ విమానాలు నడిపే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల తరహాలోనే ఈ ప్రైవేట్ రైళ్లూ నడవనున్నాయి. ఈ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రయాణ సదుపాయాలను అందజేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. కచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రస్తుతం రైళ్లలో ఐఆర్సీటీసీ కేటరింగ్ నిర్వహిస్తుండగా, ప్రైవేట్ రైళ్లలో ఆ సంస్థలే ఈ సదుపాయాన్ని కల్పిస్తా యి. ముంబై–లఖ్‌నవూ మధ్య నడు స్తున్న తేజా స్ ట్రైన్ తరహాలోనే ఈ ప్రైవేట్ రైళ్లు ఉంటాయి. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యో గులై ఉంటారు. మిగతా సిబ్బంది మొత్తం ప్రైవే ట్ సంస్థలకు చెందిన వాళ్లే ఉంటారు. రైళ్ల రాక పోకలు, సిగ్నలింగ్ మాత్రం రైల్వేశాఖే పర్య వేక్షి స్తుంది. రైల్వే పట్టాలపై తమ రైళ్లను నడుపు కొన్నందుకు ప్రైవేట్ సంస్థలు నిర్ధారిత మొత్తా న్ని రైల్వేలకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ సంస్థలతో ఏర్పాటు చేసుకొనే ఒప్పం దంలో భాగంగా ఆయా సంస్థలకు చెందిన రైళ్ల నిర్వహణకు 35 ఏళ్ల అనుమతులు లభిస్తాయి. రైల్వేల నిర్వీర్యానికే.. ప్రైవేట్ రైళ్లకు అనుమతినివ్వడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడతారని, భవిష్యత్తులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వేలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. ప్రయాణికులకు ప్రస్తుతం అతి తక్కువ చార్జీల్లో రైల్వే ప్రయాణం లభిస్తుండగా, ప్రైవేట్ రైళ్ల వల్ల చార్జీలు భారీగా పెరుగుతాయని చెప్పారు. సికింద్రాబాద్ క్లస్టర్లో నడవనున్న ప్రైవేటు రైళ్లివే.. సికింద్రాబాద్ – శ్రీకాకుళం సికింద్రాబాద్ – గుంటూరు సికింద్రాబాద్ – తిరుపతి సికింద్రాబాద్ – ముంబై సికింద్రాబాద్ – హౌరా సికింద్రాబాద్– తిరుపతి – వారణాసి విశాఖ – బెంగళూరు తిరుపతి – సికింద్రాబాద్ ముంబై – ఔరంగాబాద్ విశాఖ – విజయవాడ -
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ రైళ్లు
-
జంట నగరాల నుంచి 11 ప్రైవేట్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలందజేయనున్నాయి. మరోవైపు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు మధ్య తేజాస్ రైలు ప్రవేశపెట్టనున్నారు. చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించగా, ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కేంద్రం ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం. మొత్తంగా గత నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేరకు నిధులు కేటాయించడం మినహా ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించలేదు. (కిసాన్ రైలు) ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్‌రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ, రైళ్ల భద్రత,లొకోపైలెట్లు, గార్డులు, సిబ్బంది వంటివి మాత్రమే రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్‌బోర్డు సేవలు,రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు వంటివి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్‌లైన్స్ పలు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నట్లుగానే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు నడువనున్నాయి. టిక్కెట్ల రిజర్వేషన్లు ఆన్లైన్ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ పై ఇంకా స్పష్టత రాలేదని జీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరం నుంచి వివిధ మార్గాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టర్మినల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పన్వేల్, లింగంపల్లి-తిరుపతి,సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి-చెన్నై, చర్లపల్లి- షాలిమార్, విజయవాడ-విశాఖ, తిరుపతి-విశాఖ, తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!) అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు, ఔరంగాబాద్-పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లుగాను, మరి కొన్ని వారానికి రెండు సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు గా నడుపుతారు.ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే దశలవారీగా వీటిని పట్టాలెక్కేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు చర్లపల్లి-వారణాసి లింగంపల్లి-తిరుపతి చర్లపల్లి-పర్వేలి విజయవాడ-విశాఖపట్టణం చర్లపల్లి-శాలిమార్ ఔరంగబాద్-పన్వెలి సికింద్రాబాద్-గౌహతి చర్లపల్లి-చెన్నయ్ గుంటూరు-లింగంపల్లి ఈ రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం గుంటూరు-లింగంపల్లి ఔరంగబాద్-పన్వెలి చర్లపల్లి-శ్రీకాకుళం -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
మన స్టేషన్లో రైలు ఆగలేదు..
సాక్షి, అమరావతి: ఈ బడ్జెట్లో ఏపీ మీదుగా వెళ్లే కొత్త రైళ్ల కూతలేవీ వినిపించలేదు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్‌కు నిధులూ కేటాయించలేదు. ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఏపీకి దక్కలేదు. ఇప్పటికే విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఈ బడ్జెట్లో రైల్వేలపరంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తే, తీరని అన్యాయమే జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతేడాది పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్ల కేటాయింపు గతేడాది (2019 ఫిబ్రవరి) ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రకటించకున్నా.. ఈ నిధుల్ని ఆ తర్వాత కేటాయించారు. సాధారణంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాక దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారన్న వివరాలపై రైల్వే బోర్డు సమాచారమిస్తుంది. ప్రతిసారీలానే ఈ దఫా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజులకు కేటాయింపుల సమాచారాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటనలో.. ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికిగాను అన్ని ప్రాంతాలను కలిపేలా తేజస్ రైళ్లు, రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి వివరాలపై సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ పరిపుష్టికి సంబంధించి అంశాలుంటాయని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. -
150 ప్రైవేట్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్..
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ, హౌరా-ఢిల్లీ సెక్టార్లు సహా వంద రూట్లలో దాదాపు 150 ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ పచ్చజెండా ఊపింది. తేజాస్ ట్రైన్లను ఇప్పటికే ప్రైవేట్ రంగంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ రైల్వేలకు గట్టి పోటీకి దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వంద రోజుల అజెండాకు అనుగుణంగా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ ప్రైవేట్ రైళ్లకు ఆమోదముద్ర వేసిన క్రమంలో హైపవర్ కమిటీని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు ఖరారైన మార్గదర్శకాల ప్రకారం రైల్వే, టూరిజం రంగాల్లో అనుభవమున్న భారత, అంతర్జాతీయ కంపెనీలు ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు పోటీపడవచ్చు. రూ 450 కోట్ల కనీస నికర విలువ కలిగిన సంస్థలను ఇందుకు అనుమతిస్తారు. ఇక ప్రయాణీకులకు మెరుగైన సేవలు, రైళ్ల రాకపోకల్లో 15 నిమిషాలకు మించని జాప్యం వంటి ఇతర నిబంధనలను ఆయా కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. తొలుత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రూట్లలో ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్నారు. ఈ రూట్లలో రైళ్ల వేగం గంటకు 160 కిమీ ఉండేలా ట్రాక్స్‌ను మెరుగుపరిచేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇక ప్రైవేట్ రైళ్ల చుక్‌బుక్
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్ ఉన్న ఐదు రూట్లలో ఏడు రైళ్లను ఆపరేటర్లు నిర్వహించేందుకు అనుమతించనున్నారు. ప్రయాణీకుల లబ్ధి కోసమే వీటిని ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ నెలలోనే ఆహ్వానించేందుకు నీతి ఆయోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విమానాల తరహాలో సౌకర్యాలు కాగా, రూ.22,500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నారు. వీటిలో సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ–లక్నో మధ్య తేజస్ ప్రైవేట్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్–ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో విమానాల తరహాలో సౌకర్యాలుంటాయి. రైల్ హోస్టెస్‌లు ఉంటారు. ఏపీలోని ఐదు రూట్లలో డైలీ, ట్రై వీక్లీలుగా ఏడు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డిమాండ్ ఉన్న రూట్లలోనే.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్లి హైదరాబాద్‌లోని చర్లపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉంటున్నారు. తిరుపతికి, గుంటూరుకు లింగంపల్లి ప్రాంతం నుంచి ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే, విశాఖ–విజయవాడ, విశాఖ–తిరుపతి రూట్లలోనూ అదే పరిస్థితి. ఈ మార్గాల్లోని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ప్రైవేటు రైళ్ల నిర్వహణ ఇలా.. ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమా తదితరాలన్నీ చూసుకుంటుంది. మిగిలిన సౌకర్యాలు మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే బాధ్యత. ప్రైవేటు రైళ్లు నడిచే ఐదు రూట్లు ఇవే.. - చర్లపల్లి–శ్రీకాకుళం (డైలీ) - లింగంపల్లి–తిరుపతి (డైలీ) - గుంటూరు–లింగంపల్లి (డైలీ) - విజయవాడ–విశాఖ (ట్రై వీక్లీ) - విశాఖ–తిరుపతి (ట్రై వీక్లీ) -
తొలి ప్రైవేట్ రైలు పరుగులు
లక్నో: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం పట్టాలపై పరుగులు తీసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి, రైలును ప్రారంభించారు. లక్నో–న్యూఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్వహిస్తోంది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... ఇలాంటి రైళ్లు దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారి ప్రయాణిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. భారత్‌లో మొదటి కార్పొరేట్ రైలును పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిపేందుకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు తొలుత రంగ ప్రవేశం చేసినప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటేవని, ఇప్పుడు నేలపైకి దిగివచ్చాయని, ప్రతి ఒక్కరూ కొనగలుగుతున్నారని, ఆరోగ్యకరమైన పోటీ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలంటే ఆరోగ్యకరమైన పోటీ అవసరమని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. భారత రైల్వేశాఖ చౌకైన, భద్రతతో కూడిన ప్రయాణ సౌలభ్యం కల్పిస్తోందని కొనియాడారు. ఆగ్రా–వారణాసి మధ్య సెమి–బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అంగీకరిస్తే భూసేకరణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లక్నో–అలహాబాద్, లక్నో–గోరఖ్‌పూర్ మధ్య హైస్పీడ్ రైళ్లు నడపాలని కోరారు. ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో లక్నో–న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు లక్నో నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 10.05 గంటలకు లక్నో చేరుకుంది. ఈ రైలుకు రెండు హాల్టులు (కాన్పూరు, ఘజియాబాద్) మాత్రమే ఉన్నాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇందులో ప్రయాణించేవారు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కారుకు రూ.1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ.2,450 చెల్లించాలి. ఈ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్లే విభాగాలకు సూచించింది. -
మన రైళ్లకు ప్రైవేటు కూత..!
18 రైల్వే జోన్లకుగాను 6 జోన్లు.. సౌత్ సెంట్రల్ రైల్వేతోపాటు సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, సదరన్ రైల్వేలో పలు రైళ్లు ప్రైవేట్ కూత పెట్టనున్నాయి. నేడు ప్రతిపాదనలు సమర్పించే అవకాశం. సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. తన అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు సెమీ హైస్పీడ్ తేజస్ రైళ్లను కట్టబెట్టిన రైల్వే..మరిన్ని రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. త్వరలో బిడ్డింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో రైల్వే బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏయే రైళ్లను ప్రైవేటుకు అప్పగించొచ్చనే జాబితాతో సమావేశానికి హాజరు కావాలని రైల్వే బోర్డు జోనల్ కార్యాలయాలకు లేఖలు పంపింది. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి రెండ్రోజుల కింద ఈ మేరకు లేఖ అందింది. దీంతో మన జోన్ ఆపరేషన్ విభాగం అధికారులు శుక్రవారం ఢిల్లీ లో జరగనున్న సమా వేశానికి వెళ్లను న్నారు. రద్దీ మార్గాలే టార్గెట్.. సరుకు రవాణాలో రైల్వేది ఏక ఛత్రాధిపత్యం. బొగ్గు, సిమెంట్, ముడి ఇనుము సహా ఇతర సరుకులు భారీగా రవాణా జరుగుతోంది. సరుకు రవాణా రైల్వేకు భారీగా ఆదాయాన్ని మోసుకొస్తోంది. అయితే నామమాత్రపు టికెట్ ధరతో నడుస్తున్న ప్రయాణికుల రైళ్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. దీంతో ప్రయాణికుల రైళ్లను వదిలించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు వాటిని కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మంచి ఆదాయం ఉన్న రైళ్ల కోసమే ప్రైవేటు సంస్థలు కూడా చూస్తుంటాయి. అందుకే మంచి ఆక్యుపెన్సీ రేషియో ఉన్న మార్గాలను ప్రైవేటీకరించాలని రైల్వే నిర్ణయించింది. మంచి రైళ్ల జాబితా ఇవ్వాల్సిందిగా జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది. ఇవీ ఫుల్లుగా నిండుతాయి..! దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్–వైజాగ్, సికింద్రాబాద్–ఢిల్లీ మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ 100% ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)తో నడుస్తున్నాయి. వైజాగ్ మార్గంలో 20 రైళ్లు, ఢిల్లీ దారిలో 6 రైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్–విజయవాడ మధ్య ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎంఎంటీఎస్ కూడా? నాంపల్లి–లింగంపల్లి–ఫలక్‌నుమా మధ్య తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లలో నిత్యం 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటి సంఖ్యను, బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ఉన్నా, లైన్ల కొరత, కొత్త రైళ్ల కొనుగోలుకు నిధుల కొరత కారణంగా సాధ్యపడలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ అందుబాటులోకి వస్తే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వీటిల్లో ప్రయాణించే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్‌ను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రైల్వే బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆరు జోన్లపై దృష్టి.. దేశంలో 18 రైల్వే జోన్లు ఉన్నా.. ప్రస్తుతానికి ఆరు జోన్ల పరిధిలోనే ప్రైవేటు రైళ్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రైల్వే బోర్డు ఆరు జోన్లకే లేఖలు రాసింది. సౌత్ సెంట్రల్ రైల్వే కాకుండా.. సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, సదరన్ రైల్వేలకు ఈ లేఖలు అందాయి. ఏం జరుగుతుంది ప్రస్తుతం ఆయా మార్గాలను నిర్వహించటం ద్వారా రైల్వే పొందుతున్న ఆదాయానికంటే కొంత మొత్తం స్థిరీకరించి ప్రైవేటు సంస్థ రైల్వేకు చెల్లిస్తుంది. తర్వాత తన ఆదాయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఛార్జీలు భారీగానే పెరుగుతాయి. విమానాల్లో అమల్లో ఉండే డైనమిక్ ఫేర్ విధానం లాంటి వాటిని ప్రవేశపెడతారు. డిమాండ్ ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటా యి. టికెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మామూ లు రేటు, టికెట్లు కొన్నే ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి. మంచి భోజనం అందు బాటులోకి వస్తుంది. రైళ్లలో వసతులు మెరుగవుతాయి. రైళ్లలో సీట్ కవర్లు, దుప్పట్లు, ఫ్యాన్లు, లైటింగ్, ఏసీ, పరిశుభ్రత మెరుగవుతాయి. ప్రస్తుతం ఆయా మార్గాలను నిర్వహించటం ద్వారా రైల్వే పొందుతున్న ఆదాయానికంటే కొంత మొత్తం స్థిరీకరించి ప్రైవేటు సంస్థ రైల్వేకు చెల్లిస్తుంది. తర్వాత తన ఆదాయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఛార్జీలు భారీగానే పెరుగుతాయి. విమానాల్లో అమల్లో ఉండే డైనమిక్ ఫేర్ విధానం లాంటి వాటిని ప్రవేశపెడతారు. డిమాండ్ ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటా యి. టికెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మామూ లు రేటు, టికెట్లు కొన్నే ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి. మంచి భోజనం అందు బాటులోకి వస్తుంది. రైళ్లలో వసతులు మెరుగవుతాయి. రైళ్లలో సీట్ కవర్లు, దుప్పట్లు, ఫ్యాన్లు, లైటింగ్, ఏసీ, పరిశుభ్రత మెరుగవుతాయి. కొత్త తరహా రైళ్లు.. ప్రైవేటు వారికి ఇస్తే.. కోచ్‌లు, ఇంజిన్ల రూపురేఖలు మారే అవకాశం ఉంది. కొత్త ఇంజిన్లు, సరికొత్త బోగీలతో దర్శనమిస్తాయి. ఇటీవలే రైల్వే శాఖ భారీ రైళ్ల కోసం అత్యంత శక్తిమంతమైన అమెరికా తయారీ ఇంజిన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 15 వరకు మన దేశానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోని కాపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ, తమిళనాడు పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ, రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో రైల్వే కోచ్‌లు తయారవుతున్నాయి. ఇవి కాకుండా బెంగళూరు, బేలాల్లో చక్రాలు, యాక్సల్ తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ రైల్వే శాఖ సొంత ఫ్యాక్టరీలు. రైళ్లు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తే.. అవి సొంతంగా కోచ్‌ల తయారీ యూనిట్లు ప్రారంభించే అవకాశముంది. తేజస్ రైళ్లను సొంతం చేసుకున్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ దిశగా అడుగులేస్తోంది. రైల్వే అనుబంధ సంస్థ అయినా.. స్టాక్ ఎక్సే్ఛంజి లిస్టింగ్‌కు వెళ్లింది. -
సరుకు రవాణాకు ప్రైవేటు రైళ్లు?
కేంద్ర ప్రభుత్వం యోచన! సాక్షి, హైదరాబాద్: విమానాలు, నౌకల తరహాలో ప్రైవేటు రైళ్లు కూడా త్వరలో పట్టాలపైకెక్కే అవకాశం కనిపిస్తోంది. సరుకు రవాణా రైళ్ల నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. సరుకు బుకింగ్, రవాణా, డెలివరీ తదితరాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. రైల్వే ట్రాక్‌ను వినియోగించుకున్నందుకు రైల్వేకు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరో రెండేళ్లలో ఈ ఆలోచనను పట్టాలెక్కించే దిశగా రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల రైళ్లను మాత్రం రైల్వే శాఖే నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రదానంగా సరుకు రవాణా ఆదాయంతోనే రైల్వే మనుగడ సాగిస్తోంది. ఈ చార్జీలను భారీగా పెంచటం ద్వారా కొంతకాలంగా ఆదాయాన్ని పెంచుకుంది. తద్వారా ప్రయాణికుల రైళ్ల నిర్వహణ ద్వారా వస్తున్న భారీ నష్టాలను కొంతవరకు పూడ్చుకుంటోంది. అయితే సరుకు రైళ్లకు ప్రత్యేక మార్గాల్లేక వాటిని కూడా ప్రయాణికుల రైళ్ల మార్గాల్లోనే నడపాల్సి వస్తోంది. తొలి ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకే కావటంతో చాలా సందర్భాల్లో సరుకు రైళ్లను ఆపి వాటికి దారివ్వాల్సి వస్తోంది. దాంతో సరుకు ఎప్పటికి గమ్యం చేరుతుందో తెలియని గందరగోళం! ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోందని రైల్వే శాఖ గుర్తించింది. ఈ జాప్యం కారణంగా, ఖర్చు ఎక్కువైనా రోడ్డు రవాణాకే పలు సంస్థలు మొగ్గుతున్నాయి. దాంతో ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే సరుకు రైళ్లను గతేడాది రైల్వే శాఖ ప్రారంభించింది. దీంతోపాటు సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లు నిర్మించే వజ్ర చతుర్భుజి పథకాన్నీ పట్టాలెక్కించే పని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు సరుకు రవాణా రైళ్లకూ పచ్చజెండా ఊపి ఆ రూపంలో కూడా కొంత ఆదాయాన్ని సముపార్జించాలని భావిస్తోంది. ఇటీవల కొందరు ఎంపీలతో జరిగిన అంతర్గత సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల కుదింపు? రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల సంఖ్యను కుదించాలని రైల్వే శాఖ భావిస్తోంది. గతంతో పోలిస్తే విమాన టికెట్ల ధరలు చాలావరకు తగ్గాయి. రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్ల ధరకు అటూ ఇటుగా, పలుసార్లు అంతకంటే తక్కువలోనే విమాన ప్రయా ణాలు సాధ్యపడుతున్నాయి. ప్రధాన ప్రాంతాల మధ్య విమాన, రైల్వే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య వివరాలను రైల్వే మంత్రి ఇటీవల తెప్పించుకుని పరిశీలించారు. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణి కుల కంటే విమాన ప్రయాణి కుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు చూసి కంగుతిన్నారు. ఒకవైపు థర్డ్ ఏసీలో సీట్లే దొరక్క ప్రయాణికులు తిప్పలు పడుతుంటే ఏసీ ఫస్ట్ క్లాస్‌లో మాత్రం బోగీలు ఖాళీగా బోసిపోతున్నాయి. దాంతో వాటి సంఖ్య ను క్రమంగా తగ్గించడం, కొన్ని రైళ్లలో పూర్తిగా ఎత్తేయడం వంటి చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు.