‘పట్టా’లెక్కని ఉద్యోగాల భర్తీ! | There is a severe shortage of employees in the railways | Sakshi
Sakshi News home page

‘పట్టా’లెక్కని ఉద్యోగాల భర్తీ!

Published Wed, Aug 28 2024 5:42 AM | Last Updated on Wed, Aug 28 2024 5:42 AM

There is a severe shortage of employees in the railways

రైల్వేలో తీవ్రంగా వేధిస్తున్న ఉద్యోగుల కొరత

గ్రూప్‌ సీలో 3.11లక్షల మంజూరైన పోస్టుల్లో 2.74లక్షల మేర ఖాళీలు 

గ్యాంగ్‌మెన్, ట్రాక్‌మెన్‌ పోస్టులు భర్తీ కాకపోవడంతో ట్రాక్‌ల నిర్వహణ గాలికి 

ఓవర్‌ టైం డ్యూటీలతో సతమతం అవుతున్న సిబ్బంది 

టికెట్లు ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు 

సాక్షి, అమరావతి: భారతీయ రైల్వేలో ఏళ్లుగా ఉద్యో­గాల భర్తీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పనిభారంతో సత­మతమవుతున్నారు. నిత్యం ఓవర్‌ టైం డ్యూ­టీలు చేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది. సిబ్బంది కొ­రత కారణంగానే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద భా­రీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అందుకే టికెట్‌ బుకింగ్‌ సేవలను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3.11 లక్షల గ్రూప్‌ సి పోస్టులు, 3,018 గెజిటెడ్‌ కేడర్‌ మంజూరైన పోస్టులుంటే.. వాటిల్లో సుమారు 2.74­లక్ష­ల పోస్టులు ఇంకా భర్తీకే నోచుకోలేదు.
 
భద్రతను విస్మరిస్తూ.. 
రైల్వేలో లోకో పైలెట్లు, ట్రాక్స్‌పర్సన్స్, క్లర్క్‌లు, గారు­్డలు, రైలు మేనేజర్, స్టేషన్‌ మాస్టర్, టికెట్‌ కలె­క్టర్‌ పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ట్రాక్‌ మెయింటెనెన్స్, ఫిట్‌నెస్, సీనియర్‌–జూ­నియర్‌ సెక్షన్‌ ఇంజినీర్లు, గ్యాంగ్‌మెన్, టెక్నీíÙయన్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తగిన సిబ్బంది లేక రైల్వే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నా­యి. 

ట్రాక్‌లను తనిఖీ చేయడానికి సిబ్బంది రోజూ 8–­10 కి.మీ ప్రయాణించాల్సి ఉంది. ఇలాంటి సున్నితమైన పనిని శ్రద్ధతో చేయాల్సి ఉండగా.. పరి­స్థితు­లు భిన్నంగా కనిపిస్తున్నాయి.సేఫ్టీ కేట­గిరీలోని 1,52,734 ఖాళీలను యు ద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. 

వెంటాడుతున్న ప్రమాదాలు.. 
పాసింజర్‌ రైళ్లలో 2020–21లో 22, 2021–22లో 35, 2022–23లో 48, 2023–24లో 20 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు రైళ్లు పట్టాలు తప్పడమే ప్రధాన కా­రణంగా తెలుస్తోంది. మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే 2022–23లో రైలు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళన కలి­గిస్తున్నది. ఒక్క 2018–19లో 59 ప్రమాదాలు జరిగితే వీ­టి­ల్లో 46 రైళ్లు పట్టాలు తప్పాయంటే ట్రాక్‌ల దుస్థితి ఎంత దారుణ పరిస్థితిలో ఉందో అద్దం పడుతున్నది. 

2022–23లో 48 ఘటనల్లో 6 ప్రమాదాలు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, 36 పట్టాలు తప్పడంతో జరిగాయి. వీటిల్లో దాదాపు 17 శాతం ప్రమాదాలు ముంబై, నాగ్‌పూర్, భుసావల్, పూణే, షోలాపూర్‌ ప్రాంతాల్లోనే సంభవించాయి. సెంట్రల్‌ జోన్‌ త­ర్వాత ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్, నార్త్‌ జోన్‌లలో 6 ప్రమాదాలు జరిగాయి. దేశంలోని 18 రైల్వే జోన్లలో ఆరు జోన్లలో మాత్రమే (ఈశాన్య, నైరుతి, దక్షిణ, పశ్చిమ మధ్య, కొంకణ్, మెట్రో రైల్వేలు) ఎటువంటి ప్రమాదాలు లేకపోవడం విశేషం. 

నిధులు విదల్చట్లేదు.. 
రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ ఖర్చు చేస్తున్న నిధులను సైతం కాగ్‌ తప్పు పట్టింది. 2017–18లో ప్రవేశపెట్టిన రా్రïÙ్టయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే)  రైల్వే భద్రతా నిధి (భద్రతకు సంబంధించిన పనులకు ఆరి్థక సాయం అందించడానికి ప్రత్యేక నిధి)పేరుకు మాత్రమే ఉందని ఎద్దేవా చేసింది. 

ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత–1 పనులపై మొత్తం వ్యయం 2017–18లో 81.55 శాతం నుంచి 2019–20లో 73.76 శాతానికి పడిపోయింది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018–19లో నిధుల కేటాయింపు రూ.9,607.65 కోట్ల నుంచి 2019–20లో రూ.7,417 కోట్లకు దిగజారింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019–20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావడం గమనార్హం. 

ఉద్యోగాలు భర్తీ చేయాలి.. 
కృత్రిమ మేధస్సు (ఏఐ) ను సిబ్బంది తొలగింపునకు, పోస్టుల రద్దుకు వినియోగించే బదులు విస్తృతంగా స్టేషన్‌ డేటా లాగర్ల, లోకోమోటివ్‌ లలోని మైక్రో ప్రాసెసర్ల డిజిటల్‌ డేటాను  తక్షణమే విశ్లేషించి ప్రమాదాలను  నివారించాలి. ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని గతంలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్‌ సమర్పించిన నివేదికలో  సిఫారసులను కచ్చితంగా అమలు పరచాలి. రైల్వేలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.  – వి.కృష్ణ మోహన్, జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌  ఆర్గనైజేషన్స్‌ కాన్ఫెడరేషన్‌ (సీసీజీజీఓఓ)    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement