దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ‘ప్రీమియం తత్కాల్’ బుకింగ్‌ని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 80 రైళ్లకు ప్రీమియం తత్కాల్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. త్వరలో అన్ని రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీని ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. 2020-21 సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్‌ల ద్వారా రూ.500 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని నివేదికలు చెబుతున్నాయి.
చివరి నిమిషంలో ప్రయాణించే ప్యాసింజర్లు ప్రీమియం తత్కాల్ కోటాలో రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వీటిని డైనమిక్ ఫేర్ విధానంలో కొన్ని సీట్లను ప్రయాణికులకు కేటాయిస్తారు. డైనమిక్ ఫేర్ అనగా సీట్ల సంఖ్య పెరిగే కొద్ది డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ ధర పెరుగుతుంటుంది. కేవలం ఈ కోటా కింద ఉన్న ఛార్జీలో ప్రాథమిక రైలు ఛార్జీలు, అదనపు తత్కాల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ సమయంలో సీనియర్ సిటిజన్‌ల ఛార్జీల రాయితీలను ఉపసంహరించుకుంది రైల్వే శాఖ. ప్రస్తుతం వాటిని కూడా మళ్లీ పునరుద్దరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఆ ప్రేమను చాలా మిస్ అవుతున్నా: రతన్ టాటా భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment