Railway to upgrade ticketing capacity from 25K to 2.25 lakh per minute - Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మార్పులు రానున్నాయ్‌, నిమిషానికి 2 లక్షల టికెట్లు!

Published Sat, Feb 4 2023 11:45 AM

Railway Ticketing Capacity Plans To Upgrade From 25k To 2 Lakh Per Minute Says Minister - Sakshi

దేశ ప్రజలకు ఇండియన్‌ రైల్వేస్‌ అందిస్తున్న సేవలను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల ప్రయాణికులను తక్కువ ఖర్చుతో వారి గమ్యస్థానానికి చేరుస్తోంది. తాజాగా ప్యాసింజర్ల అందించే సేవల విషయంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతమున్న ఆన్‌లైన్ టిక్కెట్ల రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ సామ‌ర్థ్యం మరింత పెంచేందుకు కీల‌క చ‌ర్య‌లు తీసుకోనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.

భారీ మార్పులు.. నిమిషాల్లో 2 లక్షల టికెట్లు
విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,000 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే ట్రాక్‌లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ బ్యాక్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం, టిక్కెట్ల సామర్థ్యం నిమిషానికి 25,000 టిక్కెట్లు ఉండగా, ఆ సామర్థ్యాన్ని నిమిషానికి 2.25 లక్షలకు అప్‌గ్రేడ్ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని' చెప్పారు. దీని ద్వారా రిజ​ర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు మరింత సులభంగా టికెట్‌ లభించనుంది.

ఎంక్వైరీలకు హాజరయ్యే సామర్థ్యం నిమిషానికి నాలుగు లక్షల నుంచి నిమిషానికి 40 లక్షలకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే స్టేషన్లలో “జన్ సువిధ” కన్వీనియన్స్ స్టోర్లను నిర్మిస్తామని, అవి 24 గంటలూ తెరిచి ఉంటాయని ప్రకటించారు. వీటితో పాటు

2014 కి ముందు, ఇది రోజుకు నాలుగు కిలోమీటర్లు ఉండగా, 2022-23లో 4,500 కిలోమీటర్ల (రోజుకు 12 కిలోమీటర్లు) దూరం వరకు రైల్వే ట్రాక్‌లు వేయాలనే లక్ష్యం ఇప్పటికే అందుకున్నట్లు చెప్పారు. 

చదవండి: ఎలన్‌ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే!

Advertisement
 
Advertisement
 
Advertisement