Premium Tatkal
-
రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సందర్భంగా సొంత ఊరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు సురేష్. రైళ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి తత్కాల్ కోసం ప్రయత్నించాడు. సాధారణంగా స్లీపర్ చార్జీ రూ.390 వరకు ఉంటుంది. దానిపై 30 శాతం అదనంగా రూ.450 వరకు చెల్లించి తత్కాల్ టికెట్‌పై వెళ్లిపోవచ్చని భావించాడు. నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ.1800 వరకు ఖర్చవుతుంది. మొత్తంగా రూ.3600తో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి రావచ్చు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువే అయినా ఫర్వా లేదనుకున్నాడు. చూస్తుండగానే క్షణాల్లో తత్కాల్ బుకింగ్‌లు అయిపోయాయి. సరిగా అదే సమయంలో ‘ప్రీమియం తత్కాల్’ దర్శనమిచ్చింది. రూ.450 తత్కాల్ స్లీపర్ చార్జీ అమాంతంగా రూ.1050కి చేరింది. అంటే నలుగురికి కలిపి రూ.4200 చొప్పున సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.8,400 అవుతుంది. మరో గత్యంతరం లేక ప్రీమియం తత్కాల్ టికెట్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. డిమాండ్ ఉంటే చాలు.. ఒక్క తిరుపతికి వెళ్లే రైళ్లు మాత్రమే కాదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న ఏ రైళ్లలో అయినా సరే ‘ప్రీమియం తత్కాల్’ పేరిట రైల్వే అదనపు దోపిడీకి తెరలేపింది. ఫ్లైట్ చార్జీలను తలపించేలా తత్కాల్ చార్జీలను ఒకటి నుంచి రెండు రెట్లు పెంచేస్తున్నారు. గతంలో ‘డైనమిక్ ఫేర్’ పేరుతో కొన్ని పరిమిత రైళ్లకు, ఏసీ బెర్తులకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు ఏ మాత్రం రద్దీ ఉన్నా సరే స్లీపర్ క్లాస్‌ను సైతం వదిలి పెట్టకుండా అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండగ రోజుల్లో, వరుస సెలవుల్లో నడిపే ప్రత్యేక రైళ్లలో కూడా తత్కాల్‌పై రెట్టింపు చార్జీలు విధించడం గమనార్హం. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల చార్జీల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణ సదుపాయాన్ని అందజేసే రైళ్లు కూడా క్రమంగా సామాన్యులకు భారంగా మారాయి. ఈ రైళ్లకు భారీ డిమాండ్... హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 85 ప్రధాన రైళ్లు దేశ వ్యాప్తంగా బయలుదేరుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, గోదావరి ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, షిరిడీ, పట్నా, దానాపూర్ రైళ్లలో ‘ప్రీమియం తత్కాల్’ చార్జీలు విధిస్తున్నారు. -
ప్రయాణికులకు శుభవార్త.. ప్రీమియం తత్కాల్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ‘ప్రీమియం తత్కాల్’ బుకింగ్‌ని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 80 రైళ్లకు ప్రీమియం తత్కాల్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. త్వరలో అన్ని రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీని ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. 2020-21 సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్‌ల ద్వారా రూ.500 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని నివేదికలు చెబుతున్నాయి. చివరి నిమిషంలో ప్రయాణించే ప్యాసింజర్లు ప్రీమియం తత్కాల్ కోటాలో రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వీటిని డైనమిక్ ఫేర్ విధానంలో కొన్ని సీట్లను ప్రయాణికులకు కేటాయిస్తారు. డైనమిక్ ఫేర్ అనగా సీట్ల సంఖ్య పెరిగే కొద్ది డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ ధర పెరుగుతుంటుంది. కేవలం ఈ కోటా కింద ఉన్న ఛార్జీలో ప్రాథమిక రైలు ఛార్జీలు, అదనపు తత్కాల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ సమయంలో సీనియర్ సిటిజన్ల ఛార్జీల రాయితీలను ఉపసంహరించుకుంది రైల్వే శాఖ. ప్రస్తుతం వాటిని కూడా మళ్లీ పునరుద్దరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ ప్రేమను చాలా మిస్ అవుతున్నా: రతన్ టాటా భావోద్వేగం -
‘ప్రీమియం’ దోపిడి
సాక్షి, సిటీబ్యూరో: ఉన్న పథకానికే కొత్త పేరు... ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్నట్టు ప్రకటనలు. అసలుకు ఎసరు. అడ్డదారిలో డబ్బులు పోగేసుకునే వ్యూహం. ఇదీ రైల్వే అధికారుల తీరు. ప్రీమియం రైళ్ల పేరుతో కొత్త తరహా బెర్తుల బేరానికి దిగిన దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లనూ వదిలిపెట్టడం లేదు. వాటిని ‘ప్రీమియం’ రూట్‌కు మళ్లించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బాగా ఉన్న ఏడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’ చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ చార్జీలు ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు భారంగా మారాయి. మిగిలిన రైళ్ల లాగానే తత్కాల్ కోటాలోనే కోత విధించి...‘ప్రీమియం తత్కాల్’ పేరిట దోపిడీకి దిగడం గమనార్హం. జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏడు ప్రధాన రైళ్లలో ప్రవేశపెట్టిన ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దక్షిణ్, గోదావరి, బెంగళూర్, శబరి, పాట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రీమియం తత్కాల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లలోని తత్కాల్ టిక్కెట్లకు కోత పెట్టి 50 శాతం ప్రీమియం తత్కాల్ కిందకు మార్చేశారు. దీంతో ప్రయాణికులు రెట్టింపు మొత్తం చెల్లించవలసి వస్తోంది. మొదట్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్ల (సాధారణ చార్జీలే ఉంటాయి) స్థానంలో ప్రీమియం రైళ్లను (రెట్టింపు చార్జీలు) ప్రవేశపెట్టారు. సెలవులు,పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీని బట్టి ప్రీమియం రైళ్లను నడిపే అధికారులు... ప్రస్తుతం రద్దీతో నిమిత్తం లేకుండా రెగ్యులర్ రైళ్లలో సైతం తత్కాల్ టిక్కెట్లను ప్రీమియంతో ముడిపెట్టడం విశేషం. కోటాకు టాటా... అన్ని రైళ్లలోనూ ఫస్ట్‌క్లాస్, సెకెండ్ ఏసీ, థ ర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలలో 30 శాతం చొప్పున తత్కాల్ టిక్కెట్లు ఉంటాయి. ఒక స్లీపర్ క్లాస్ బోగీలో సాధారణంగా 72 బెర్తులు ఉంటాయి. వాటిలో 22 తత్కాల్కుకేటాయిస్తారు. సాధారణ చార్జీల కంటే తత్కాల్పైరూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ క్లాస్ రూ.475 ఉంటే ... తత్కాల్లో అది రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రతి రైలులోనూ అన్ని తరగతులతో కలిపి సుమారు 300 బెర్తులకు అదనపు చార్జీలతో 24 గంటల ముందుగా బుక్ చేసుకొనే అవకాశం ఉంది. రెండు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’తో... అసలైన తత్కాల్ కోటాకు సగం వరకూ కోత పడింది. అదే సమయంలో చార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రయాణికులపై మరింత భారం పెరిగింది. ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు నాంపల్లి: ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పౌర సంబంధాల నమూనా లేనప్పటికీ భారతదేశంలో పీఆర్ వ్యవస్థ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్లోబల్ అలయన్స్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్ గ్రేగర్ఆఫ్ అన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘గెటింగ్ టు లీడర్ షిప్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, వియత్నాంలోనూ ఉత్తమ పీఆర్ నమూనాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ డాక్టర్ సి.వి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ కె.నరేంద్ర, డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు. -
ప్రీమియం తత్కాల్ పేరుతో వీర బాదుడు
హైదరాబాద్: ఇప్పటికే తత్కాల్ పేరుతో ప్రయాణికుల మీద పెనుభారం మోపుతున్న రైల్వేశాఖ ఇప్పుడు అందులోనూ మరో సరికొత్త వీరబాదుడు మొదలుపెట్టేసింది. అసలు తత్కాల్ ఛార్జీలే ఎక్కువనుకుంటే అందులో మళ్లీ ప్రీమియం తత్కాల్ అంటూ మరో కొత్త కోటాను తీసుకొచ్చింది. మొత్తం తత్కాల్ సీట్లలో సగం వరకు ఈ కోటాలోకి వెళ్లిపోతాయి. ఈ ప్రీమియం తత్కాల్‌ను బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. 7 ప్రధాన రైళ్లు.... ఫలక్నామా, పాట్నా, ఏపీ, బెంగళూరు, గోదావరి, దర్శన్, శబరి ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ప్రీమియం తత్కాల్ సౌకర్యం ఉంటుందని పేర్కొంది. కోచ్‌లలో బెర్త్‌లు తగ్గే కొద్దీ ఛార్జీలు పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. డైనమిక్ ఫేస్ స్ట్రక్చర్ కింద టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపింది. తత్కాల్లోని 50 శాతం టికెట్ల కోటాను ప్రీమియం తత్కాల్‌కు బదిలీ చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే విశదీకరించింది.