దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ప్రయాణీకుని అవసరాలకు తగినట్లుగా భారతీయ రైల్వే సౌకర్యాలు కల్పిస్తోంది. రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్.. ఇలా రకారకాల బెర్తులు ఉంటాయి. అయితే మిడిల్, అప్పర్ బెర్తులకు పెద్ద వయసువారు ఎక్కలేరు.
ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా లోయర్ బెర్త్‌ల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే కుటుంబంలోని సీనియర్ సిటిజన్‌ల కోసం టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు వారికి కచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే రైల్యేవారి కొత్త రూల్స్ పాటించాలి.
సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే పలు నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌లు సులభంగా కేటాయిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ (IRCTC) పేర్కొంది. కాళ్ల సమస్యలు ఉన్న తన అంకుల్ కోసం రైలు టికెట్ బుక్ చేసి, లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ రైల్వే మాత్రం ఆయనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు.
సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేసుకోవాలి? అంటూ కోరాడు. ప్రయాణికుడి ట్వీట్‌పై రైల్వే స్పందిస్తూ, సాధారణ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే, సీట్లు అందుబాటులో ఉంటేనే లోయర్ సీట్ల కేటాయింపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిజర్వేషన్ సెలక్షన్ బుక్ కింద బుక్ చేస్తేనే లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది.
ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యం
జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లోయర్ బెర్తులు కేటాయిస్తామని రైల్వే తెలిపింది. ఈ సీట్ల కేటాయింపు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే పద్ధతిలో ఉంటుంది. జనరల్ కోటా బెర్త్ కేటాయింపులో మానవ ప్రమేయం ఉండదు. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈ (TTE)ని సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment