రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది! | Indian Railways Sees Decrease In Senior Citizen Travellers In 2021, Pandemic Key Reason | Sakshi
Sakshi News home page

రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా!

Published Mon, Nov 28 2022 4:14 PM | Last Updated on Mon, Nov 28 2022 4:40 PM

Indian Railways Sees Decrease In Senior Citizen Travellers In 2021, Pandemic Key Reason - Sakshi

కరోనా మహ్మమారి రాకతో దాదాపు అన్నీ రంగాల ఆదాయాలకు గండి పడింది. ఇటీవలే  దీని నుంచి బయట పడుతూ కొన్ని పుంజుకుంటుండుగా, మరి కొన్ని డీలా పడిపోయాయి. ఈ వైరస్‌ దెబ్బకు ఇండియన్‌ రైల్వేస్‌ ఆదాయానికి కూడా చాలా వరకే గండిపడింది. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ దెబ్బ నుంచి కోలుకుంటోంది. అయితే తాజాగా ట్రైన్‌లో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్స్‌ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి.
 

కరోనా పరిస్థితులతో పాటు, గతంలో పలు కారణాల వల్ల  టికెట్‌పై ఇచ్చే రాయితీని నిలిపేయడంతో రైళ్లలో వయోవృద్ధల ప్రయాణాలు ఈ ఏడాది 24 శాతం తగ్గాయని వెల్లడయ్యింది. 2018-2019లో 7.1 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించగా, 2019-20లో ఈ సంఖ్య 7.2 కోట్లకు పెరిగింది. అయితే, 2021-22లో దాదాపు 5.5 కోట్ల మంది మాత్రమే రైలులో ప్రయాణించారు. 

ఈ విభాగం ప్రయాణీకుల సంఖ్య తగ్గుదల కారణంగా, రైల్వే శాఖ ఆదాయం గతంలో పోలిస్తే 13 శాతం క్షీణించింది. ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం..  2018-2019లో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం రూ. 2,920 కోట్లు, 2019-2020లో రూ. 3,010 కోట్లు, 2020-21లో రూ. 875 కోట్లు,  2021-22లో రూ. 2,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 

చదవండి: అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్‌ మూసివేత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement