రైల్వే ప్రయాణికులకు కేంద్రం భారీ షాకిచ్చింది. బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్‌లను క్యాన్సిల్ చేసుకుంటే వాటిపై జీఎస్టీ వసూలు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సర్క్యిలర్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఆ టికెట్లపై మాత్రమే 5 శాతం జీఎస్టీని విధిస్తున్నట్లు తెలిపింది. ట్రైన్ టికెట్ రద్దుపై ఛార‍్జీ (జీఎస్టీ) అనేది.. ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా చెల్లించేదని ఆ సర్క్యిలర్‌లో పేర్కొంది.
క్యాన్సిలేషన్‌పై జీఎస్టీ ఎందుకు?
మంత్రిత్వ శాఖ ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ (TRU) జారీ చేసిన సర్క్యిలర్‌లో టిక్కెట్ల బుకింగ్ అనేది 'కాంట్రాక్టు'. వసూలు చేసిన జీఎస్టీ కింద సర్వీస్ ప్రొవైడర్ (ఐఆర్‌సీటీసీ/ఇండియన్ రైల్వే ) కస్టమర్‌లకు సేవల్ని అందిస్తామని హామీ ఇచ్చింది.
ఎంత వసూలు చేస్తుంది
సాధారణంగా ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే.. ఆ బుకింగ్ పై 5శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. ఇప్పుడు అదే టికెట్‌లను బుక్ చేసుకొని రద్దు చేస్తే 5శాతం జీఎస్టీని విధిస్తుంది. ఉదాహరణకు ఒక్క క్యాన్సిలేషన్ టికెట్‌పై రూ.240 వసూలు చేస్తుండగా ట్యాక్స్ రూ.12 + రూ.240 (జీఎస్టీ)ని వసూలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment