పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి.
ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment