Employess
-
సమ్మెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైరన్?
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్ఆర్ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. -
Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!
సాక్షి,ముంబై: టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా డెల్ కంపెనీ అమ్మకాలు భారీ క్షీణించాయని ఐడీసీ పేర్కొంది. తొలగింపుల తర్వాత, డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. డెల్ ఆదాయం దాదాపు 55 శాతం పీసీల నుంచే వస్తుంది. -
ఉద్యోగులకు అలర్ట్: ఆ బాటలో ఇన్ఫోసిస్, సూపర్ ఆఫర్ కూడా
సాక్షి, ముంబై: కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి క్రమంగా టెక్ దిగ్గజాలు గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మూడు దశల వర్క్ ప్లాన్‌ను అమలు చేస్తుండగా, తాజాగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఈ కోవలో చేరింది. వారానికి రెండు సార్లు ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులకు అంతర్గత సమాచారాన్ని అందించింది. దీనికి సంబంధించి మూడు దశల వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ప్లాన్‌తోపాటు ఉద్యోగులకు మరో సౌలభ్యాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించడం విశేషం. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కృష్ణమూర్తి శంకర్ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ఈ విధానం ఉద్యోగులకు సౌలభ్యాన్ని కల్పిస్తుందని, “ఒకే పరిమాణానికి సరిపోయే విధానం కాదని పేర్కొన్నారు. మూడు దశలుగా దీన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. (WhatsApp మరో అద్భుత ఫీచర్: కంపానియన్ మోడ్, అంటే ఏంటంటే?) దశల వారీగా మొదటి దశ ఉద్యోగులు "వారి సౌలభ్యం ప్రకారం వారానికి రెండుసార్లు కార్యాలయానికి రావడానికి" వీలు కల్పిస్తుంది. రెండో దశలో, ఉద్యోగులు తమకు నచ్చిన బ్రాంచ్ కార్యాలయానికి బదిలీ లేదా మారడానికి వీలు కల్పిస్తుంది. ఇక చివరి దశలో ఈ రెండు దశల పని తీరు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా హైబ్రిడ్-వర్క్ పాలసీపై నిర్ణయ తీసుకుంటుంది. ఉద్యోగులందరినీ తిరిగి కార్యాలయానికి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు తిరిగి రప్పించేలా టీసీఎస్ ఇప్పటికే హైబ్రిడ్ మోడల్‌ను ప్రారంభించింది. (ElonMusk క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) -
మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సీపీఎస్ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్‌ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్ వద్దు.. అవసరమైతే ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)లో కొన్ని అంశాలను సవరించమంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలోనే రెండింటి మధ్య ఎక్కడోచోట సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’.. అని బొత్స అన్నారు. జీపీఎస్‌లో అదనపు బెనిఫిట్స్ ప్రతిపాదించారు.. మంత్రుల కమిటీ ద్వారా పాత పెన్షన్ విధానంపై తీపికబురు వస్తుందనుకుంటే నిరాశే ఎదురైందని రాష్ట్ర సీపీఎస్ ఉద్యమ వ్యవస్థాపకుడు పి. రామాంజనేయులు యాదవ్ అన్నారు. అయితే, కొత్తగా జీపీఎస్‌లో హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తామనడం సానుకూలంగా ఉందన్నారు. ఇక జీపీఎస్‌పై అయితే భవిష్యత్తులో చర్చలకు వచ్చేదిలేదని.. పాత పెన్షన్‌పై అయితేనే చర్చలకు వస్తామని ఆయన స్పష్టంచేశారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్‌ను అమలుచేయమంటే జీపీఎస్‌పై చర్చిస్తున్నారన్నారు. దీంతో సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడిని చేపడతామన్నారు. ఎవరో పిలుపునిస్తే.. మేమా బాధ్యులమా? ఇక సీపీఎస్ ఉద్యోగుల బ్లాక్ డే సందర్భంగా విజయవాడలో శాంతియుతంగా సభ పెట్టుకుంటామంటే.. ఎవరో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే.. తమ సంఘ నాయకులను బైండోవర్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
బుక్‌మైషోలో 270 ఉద్యోగాల కోత
వైరస్ మహమ్మారి విజృంభణతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బుక్‌మైషో కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది. కోవిడ్-19 కారణంగా త్వరలో తమ కంపెనీలో పనిచేస్తోన్న 1,450 మంది సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు బుక్‌మైషో ప్రకటించింది. దీంతో 270 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక అసమానతలు తగ్గించుకునేందుకు, ఈక్రమంలోనే ఖర్చులను అదుపుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రాబోయే నెలల్లో చేపడతామని వివరించింది. ఇప్పటికే వేతనంలేని సెలవుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు కోల్పోయినవారికి ఉద్యోగ ప్రమాణాల ప్రకారం అన్ని వైద్య, బీమా ,గ్రాట్యూటీ ఇతర అలవెన్సులు అందిస్తామని బుక్‌మైషో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆశిస్ హేమరాజని వెల్లడించారు. తద్వారా ఉద్యోగులకు ఆర్థిక సాయం అందుతున్నారు. ఇంకా కంపెనీలో కొన్ని టీమ్‌లు స్వచ్చందంగా 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించుకున్నాయని, బోనస్‌లను సైతం వదులకున్నాయని తెలిపారు. కంపెనీకి సంబంధించి ఇతర రకాల ఖర్చులను తగ్గించుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్లో విజృంభించి అనేక రకాల పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో లాక్డౌన్ చాల ముఖ్యమైనది. దీని ద్వారా వైరస్ వ్యాప్తికి కొంత మేర అడ్డుకట్ట వేసినప్పటికీ.. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, స్టేడియంలు, మాల్స్ మూతపడడం వల్ల, ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు, వ్యయభారాలను కొంత మేర తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. గతవారంలో ఓలా, ఉబర్, జొమాటో, స్విగ్గీ, రోల్స్‌రాయిస్ వంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. -
7 జోన్లు.. 2 మల్టీ జోన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, వికారాబాద్ జోన్లను ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న మల్టీ జోన్లను రద్దు చేయాలని సిఫారసు చేసింది. కమిటీ సిద్ధం చేసిన ముసాయిదా ప్రతులను ప్రభుత్వం వారం రోజుల కిందట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించింది. ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ముసాయిదాకు భిన్నంగా జోన్లు, మల్టీ జోన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు పచ్చజెండా ఊపారు. ఒక్కో జోన్లో నాలుగైదు కొత్త జిల్లాలుండేలా పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు అజయ్ మిశ్రా, నర్సింగ్‌రావు, శివశంకర్, అధర్ సిన్హా, భూపాల్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీ ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు సమావేశంలో పాల్గొన్నారు. జోన్లకు పుణ్యక్షేత్రాల పేర్లు కొత్తగా నిర్ణయించిన 7 జోన్లలో చార్మినార్ మినహా అన్నింటికీ పుణ్యక్షేత్రాల పేర్లను ఖరారు చేశారు. మొదటి జోన్‌కు కాళేశ్వరం, రెండో జోన్‌కు బాసర, మూడో జోన్‌కు రాజన్న, నాలుగో జోన్‌కు భద్రాద్రి, అయిదో జోన్‌కు యాదాద్రి, ఆరో జోన్‌కు చార్మినార్, ఏడో జోన్‌కు జోగుళాంబ అని పేరు పెట్టారు. ఒకటో మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లను నిర్ణయించారు. రెండో మల్టీ జోన్లో యాదాద్రి, జోగుళాంబ, చార్మినార్‌లకు చోటిచ్చారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ ఒకటో మల్టీ జోన్లో, దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ రెండో మల్టీ జోన్లో చేరినట్లయింది. రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియజేయడంతోపాటు ఇతర అంశాలు చర్చించేందుకు శుక్రవారం టీజీవో భవన్లో సమావేశం జరగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారిఅభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదానికి నివేదిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, రాష్ట్రంలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సీఎం చెప్పారు. మల్టీ జోనల్ అంటే..? జోనల్ స్థాయి, రాష్ట్ర కేడర్‌కు మధ్యలో ఉండే పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణిస్తారు. మల్టీ జోనల్ విధానం ఉమ్మడి రాష్ట్రంలోనూ అమల్లో ఉండేది. అప్పుడు కూడా ఆరు జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లున్నాయి. తెలంగాణలోని 5, 6 జోన్లు, 4వ జోన్‌లోని రాయలసీమ కలిపి ఒక మల్టీజోన్, ఏపీలోని మిగతా మూడు జోన్లు కలిపి మరో మల్టీ జోన్‌గా ఉండేవి. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వర్గీకరణ ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉంది. ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీవో పోస్టులు మల్టీ జోనల్ పరిధిలో ఉన్నాయి. డీఎల్పీవోలు జోనల్ పోస్టులుగా, ఆపై స్థాయిలో ఉండే డీపీవో పోస్టులు రాష్ట్ర కేడర్‌గా పరిగణిస్తున్నారు. ఇదే క్రమంలో సీడీపీవోలు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, డిప్యూటీ ఈవోలు, డ్రగ్స్ మైనింగ్ విభాగాల్లోని కొన్ని పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లో ఉన్నాయి. రాష్ట్ర కేడర్ పోస్టులు నేరుగా భర్తీ చేస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పోటీ పడే అవకాశముంటుంది. అందుకే స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉండేదుకు వీలుగా మల్టీ జోన్లను కొనసాగించాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం మల్టీ జోనల్ వ్యవస్థను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. శాఖల వారీగా పోస్టులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర కేడర్‌గా వర్గీకరిస్తేనే ఈ విధానంతో ప్రయోజనం ఉంటుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి. -
7 జోన్లుగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో గురువారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు ప్రయోజనాలు, గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టీజీవో భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపుతారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి తెచ్చేలా చేస్తానని కేసీఆర్ తెలిపారు. ప్రతిపాదిత జోన్లు కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ చార్మినార్ జోన్ (1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ ప్రతిపాదిత మల్టీ జోన్లు కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా) యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా) -
'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్ క్యారియల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. జూన్ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్ గణపతి రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. -
దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. భక్తులు వినియోగించిన టిక్కెట్లను సోమవారం తిరిగి మరోసారి భక్తులకు ఇచ్చి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన భక్తులు ఆలయ సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ఇది తొలిసారి కాదు. అనేక విషయాల్లో ఆలయంలో పనిచేస్తున్న కొందరు అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తరుచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. -
సచివాలయానికి వెళ్లం: ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఉద్యోగులంతా కలిసి తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే బస్సు నాన్‌స్టాప్ సర్వీస్ పేరుతో నడుపుతూ ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఆమల్లోకి రావడంతో సమయానికి చేరుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోయారు. దీనిపై తాము ఆర్టీసీ ఆర్ఎంకు ఫిర్యాదు చేయగా ఆయన సైతం ఎక్కడా ఆపవద్దంటూ ఆదేశాలు జారీచేసినా సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు సచివాలయానికి వెళ్ళబోమంటూ బస్సు నుంచి దిగి ఆందోళన చేస్తున్నారు. -
‘విద్యుత్’ బదిలీలపై సందిగ్థం
మూడు జాబితాలు సిద్ధం చేసిన ఏపీఈపీడీసీఎల్ ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగుల్లో అయోమయం రెండు పంపిణీ సంస్థలకు ఒకేలా మార్గదర్శకాలు ఒకే జాబితా తయారు చేసిన ఏపీఎస్పీడీసీఎల్ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) బదిలీలపై ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సందిగ్థత నెలకొంది. శనివారంతో బదిలీల గడువు ముగుస్తున్నా ఏ ప్రాతిపదికన బదిలీలు చేస్తారన్న దానిపై ఇప్పటికీ ఉద్యోగులు ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలో దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదారి జిల్లాకు ఏపీఈపీడీసీఎల్, తిరుపతి కేంద్రంగా ఏపీఎస్పీడీసీఎల్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన విద్యుత్ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టి ఈ నెల 15వ తేదీకి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఆఫీస్ ఆర్డర్(టి.ఓ.ఓ) జారీ అయింది. అప్పుడే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వీటి ప్రకారం ఒక స్టేషన్లో ఐదేళ్లపాటు ఉన్న వారు, ఒక పోస్టులో మూడేళ్లపాటు కొనసాగిన కార్యాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేయాలి. అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలి. అందులోనూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఫలితంగా దాదాపు 16 శాతం ఉద్యోగులు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. . మూడు జాబితాలు సిద్ధ చేసిన ఏపీఈపీడీసీఎల్... రెండు పంపిణీ సంస్థల మధ్య మార్గదర్శకాల్లో వ్యత్యాసం, ఇతర కారణాల వల్ల సకాలంలో బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన మరోసారి టీఓఓ జారీ చేశారు. ఈనెల 24వ తేదీకి బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే అర్హులైన ఉద్యోగులు సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యాసాధ్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూ డివిజన్లు, సర్కిల్ పరిధిలో డీఈలు, ఎస్ఈలు ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. అయితే రెండు సంస్థలకు ఒకే మార్గదర్శకాలు జారీ అయినా ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్లు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సీనియారిటీ లిస్టులు సిద్ధం చేసిన వైనం భిన్నంగా ఉంది. ఏపీఈపీడీసీఎల్ స్టేషన్, పోస్టు సర్వీసు ఆధారంగా ఒకే లిస్టు తయారులు చేయగా ఏపీఈపీడీసీఎల్ స్టేషన్ పరిధి మేరకు ఒకటి, పోస్టులో సర్వీసు ఆధారంగా ఒకటి, స్టేషన్ పరిధి, పోస్టు సర్వీసు ఆధారంగా మరొకటి వెరసి మొత్తం మూడు లిస్టులు తయారు చేసింది. దీంతో ఏ లిస్టు ప్రాతిపాదికగా బదిలీలు చేస్తారన్న సందిగ్థం ఉద్యోగుల్లో నెలకొని ఉంది. . ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో లిస్టులో మాయం... రాజమహేంద్రవరం సర్కిల్లో దాదాపు 2 వేల పోస్టులున్నాయి. ఇందులో దాదాపు 1600 మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 400 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులందరూ ఒకటో లిస్టు, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారు రెండో లిస్టు, ఒకే స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి ఉన్న వారందరూ మూడో లిస్టు ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. అయితే ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో రెండు లిస్టుల్లో లేకపోవడంతో బదిలీ ఏ జాబితా ప్రకారం చేస్తారన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఉదహరణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమహేంద్రవరం సర్కిల్ (తూర్పు గోదావరి జిల్లా మొత్తం)లోని ఓ విభాగంలో పని చేసే ఓ సీనియర్ ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఒకే స్టేషన్ (రాజమహేంద్రవరం)లో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగి పేరు స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన తయారు చేసిన ఒకటో లిస్టులో లేదు. అదేవిధంగా ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులను ప్రాతిపదికగా తయారు చేసిన రెండో లిస్టులోనూ ఆ ఉద్యోగి పేరు లేదు. కానీ ఆ విభాగంలో మిగతావారి కన్నా ఆ ఉద్యోగి ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలలో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. కానీ ఒకటి, రెండు జాబితాల్లో ఆ ఉద్యోగి పేరులేదు. మూడో జాబితాలో ఉంది. ఇప్పుడు ఏ జాబితా ప్రాతిపదికగా ఉద్యోగుల బదిలీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకటో జాబితా ప్రాతిపదికగా చేస్తే ఒకే స్టేషన్లో 20 ఏళ్లు నుంచి ఉంటున్న ఆ ఉద్యోగి అక్కడే ఉంటారు. ఫలితంగా అతని కన్నా జూనియర్ బదిలీ అవుతారు. మూడు లిస్టులు రూపాందించిన ఏపీఈపీడీసీఎల్ దేని ప్రకారం ఉద్యోగులను బదిలీలు చేస్తారోనన్న ఆందోళనతో ఉన్నారు. సాధ్యాసాధ్యాల ఆధారంగా బదిలీ చేస్తాం... ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నా సాధ్యాసాధ్యాలు, అవసరాల ప్రకారం బదిలీలు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పనులతో కూడిన విధులు కాబట్టి పెట్టిన ఆప్షన్లు రాకపోవచ్చు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటాం. శనివారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తాం. – వైఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఏపీఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం సర్కిల్ -
‘అమరావతి వెళ్లం.. హైదరాబాద్‌లోనే ఉంటాం’
హైదరాబాద్: ఏపీ కొత్త రాజధాని అమరావతికి తాము వెళ్లబోమంటూ తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో ఉంటేనే ఆంధ్రా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, మరి అమరావతికి వెళ్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే అమరావతికి వెళ్లలేమంటూ టీఎన్జీవో భవన్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి టీఎన్జీవో నేతలు మద్దతు తెలిపారు. జూన్ లోనే తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఎర
రూ. 2,500 నుంచి రూ. లక్షకు పైగా వసూలు హైదారాబాద్: బడా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకొని మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ ముఠాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. నోయిడాకు వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం... ముఖేశ్ మిశ్రా అనే వ్యక్తి సైన్.కామ్ నుంచి నిరుద్యోగులకు చెందిన మూడు వేల రెస్యూమ్(బయోడేటా)లు రూ. 6 వేలకు కొనుగోలు చేశాడు. ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బల్క్‌గా కొనుగోలు చేశాడు. ఆ రెస్యూమ్‌లను నోయిడాకు చెందిన భగీరత్ త్యాగికి ఇవ్వగా, అందులో కొన్నింటిని ఎంపిక చేసి అతను టెలికాలర్స్కు ఇచ్చాడు. బయోడేటాలోని వివరాల ఆధారంగా టెలికాలర్స్ ఫోన్ చేసి... మేం షైన్.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం...బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఉద్యోగాలున్నాయని నమ్మిస్తారు. ఎవరైనా ఆసక్తి చూపితే రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత 2,500 లు చెల్లించాలంటారు. ఆ తర్వాత ఫోన్లో ఇంటర్వ్యూ చేసి మీరు సెలక్ట్ అయ్యారని సమాచారమిస్తారు. ఆఫర్ లెటర్ కోసం రూ.5,600 లు డిపాజిట్ చేయమంటారు. ఆ తర్వాత ఒరిజినల్ కంపెనీల నుంచి వచ్చినట్టుగా అభ్యర్థులు భావించేలా ముఖేశ్ మిశ్రా ఈఎంకేఈఐ.సీజెడ్ నుంచి ఆఫర్ లెటర్లు తయారు చేసి పంపిస్తాడు. ఆ తర్వాత శిక్షణ ఫీజు, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చార్జీల కింద రూ.25 వేల వరకు డిపాజిట్ చేయాలని అభ్యర్థులను కోరతాడు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా లక్షకు పైగా చెల్లించారు. కాగా, నగరానికి చెందిన బాధితుడు చటకొండ బాల యోగీశ్వర్ ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు నోయిడా వెళ్లి నిందితులు ముఖేశ్ మిశ్రా, సునీల్ కుమార్ గుప్తా, భగిరత్ త్యాగి, సందీప్ సింగ్‌లను అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన సుమారు 70 మందిని వీరు మోసం చేసినట్టు విచారణలో గుర్తించారు. అయితే ఈ సంఖ్య రెండువేలకు పైగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. -
సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హెల్త్‌కార్డుల జారీతోపాటు 15 రోజుల్లో 10వ పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆర్‌కు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశాయి. పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులు పి.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.నరోత్తంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జునశర్మ, ఆల్ ఇండియా టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ బి.మోహన్‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ చైర్మన్ ఇ.వెంకటేశం, కో చైర్మన్ డి.సర్వయ్య, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నవ్వ ధమనేశ్వరరావులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగుల వ్యవహారాలపై సర్కార్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాల అమలు కోసం కమిటీలు వేయాలని సర్కార్ నిర్ణయించింది. 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి, వాటికి పరిష్కారమార్గాలను సూచించడానికి గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. కేంద్ర వేతనాలపై...కేంద్రప్రభుత్వ వేతనాల అమలుకు సంబంధించి కూడా కమిటీని నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎంత.? వాటిని ఏ విధంగా రాష్ట్ర ఉద్యోగులకు వర్తింప చేయాలి.? అన్న అంశాలపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని నియమించనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయన్న భావన ఉంది. వేతన సవరణ సంఘం తన నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి సమర్పించిన విషయం విదితమే. ప్రభుత్వం ఈ వేతన సవరణ సంఘం నివేదికను అమలు చేయడమా.? లేక కేంద్ర వేతనాలు అమలులోకి తీసుకుని రావాలా..? అనే అంశాలను పరిశీలించనుంది, కాగా కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న వేతనాలు 2006లో నిర్ణయించిన వేతన సంఘం ఆధారంగా అమలు అవుతున్నాయి. వారికి 2016లో వేతన సవరణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు పీ ఆర్సీని అమలు చేయకుండా ఆపడమా.? 2016 కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేస్తే.. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సవరణ అమలు చేయాలా.? అన్న అంశాలపై కమిటీ నివేదిక ఇస్తుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. నాగిరెడ్డి అధ్యక్షతన మరో కమిటీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటు కానుంది. దీనిని ఉద్యోగుల గ్రీవెన్స్ కమిటీ అని పేర్కొననున్నారు. ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను ఈ కమిటీ సరిదిద్దనుంది. -
హెల్త్‌కార్డుల ప్రీమియం వసూలు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం ప్రీమియం వసూలును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మార్చి నెల జీతం నుంచి ప్రీమియం వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఉద్యోగులు కోరిన విధంగా పథకంలో ఉన్న లోపాలు సవరించడం ఇప్పట్లో సాధ్యం కాదని, అందువల్ల హెల్త్‌కార్డుల పథకం అమలుపై నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వాలకు విడిచిపెట్టాలని తాజాగా నిశ్చయించారు. ఈ నేపథ్యంలో హెల్త్‌కార్డుల పథకం ప్రీమియం వసూలును వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం తనను కలసిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందానికి చెప్పారు. మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగుతుందంటూ ఉత్తర్వులివ్వాలని తాము చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రీమియం వసూలు చేయవద్దనే ఉత్తర్వులతోపాటు రీయింబర్స్మెంట్ కొనసాగింపు ఆదేశాలు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశముందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా విభజన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను కమల్‌నాథన్ కమిటీకి నివేదించాలని ఉద్యోగ సంఘాలకు సీఎస్ సూచించారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగులకే ఆప్షన్ సౌకర్యం ఉంటుందని, మిగతా వారికి ఉండబోదన్నారు. -
వారినుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందే
-
వారినుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందే
ఆప్షన్ ప్రాతిపదికగా ఉద్యోగుల పంపిణీ చేయాలంటున్న చట్టం కానీ ఆ తర్వాత ఏం చేయాలనే స్పష్టత శూన్యం న్యాయ నిపుణులు, ఉద్యోగ సంఘాలతోను చర్చించే అవకాశం వచ్చే 4ఏళ్లల్లో 57 వేలమంది పదవీ విరమణ విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 56 వేల మంది ఉద్యోగుల్లోని ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కమలనాథన్ కమిటీ మధ్య జరిగిన భేటీ నిర్ణ రుుంచింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యో గుల పంపిణీ ఆప్షన్ ప్రాతిపదికగా చేయాలని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 56 వేల మంది ఉద్యోగుల్లోని ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందేనని గురువారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కమలనాథన్ కమిటీ మధ్య జరిగిన సమావేశం నిర్ణరుుంచింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీ ఆప్షన్ ప్రాతిపదికగా చేయాలని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ కేడర్‌కు చెందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 56 వేల మందిగా ఉందని ఆర్థిక శాఖ లెక్కలు తేల్చింది. మరి కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తొలుత 56 వేల మందిలోని ప్రతి ఉద్యోగి నుంచి.. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో చెప్పాల్సిందిగా ఆప్షన్ తీసుకుంటారు. ఆ తరువాత ఏమి చేయాలో, ఏ వూర్గదర్శకాలను అనుసరిస్తారోననే స్పష్టత ప్రస్తుతం అధికారగణంలోనే లేదు. ఒక ఉద్యోగి స్థానికత నిర్ధారణకు జన్మస్థలం, చదువుకున్న ప్రాంతం, ఉద్యోగంలో చేరిన ప్రాంతం... ఇలా దేన్ని ప్రావూణికంగా తీసుకుంటారనే స్పష్టత కూడా లేదు. వారికి మినహాయింపు ఇస్తారా?: పార్లమెంటు ఆమోదించిన బిల్లు మేరకు ఆప్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ తర్వాత ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల అభిప్రాయూలూ తీసుకుని సజావుగా విభజన అవులు చేయూలని భావిస్తున్నారు. కొద్ది సంవత్సరాల్లో రిటైరయ్యే ఉద్యోగులకు, ఒకప్రాంతంలో పుట్టి వేరే ప్రాంతంలో చదువుకుని ఉద్యోగాల్లో చేరినవారికి ఏమైనా మినహారుుంపు ఇస్తారా అనే విషయుంలోనూ ఉద్యోగ వర్గాల్లో సందేహాలు అలాగే ఉన్నారుు. దీనిపై వుుందుగా ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని ఆ కేటగిరీల్లోకి వచ్చే ఉద్యోగులు కోరుకుంటున్నారు. విభజన విషయంలో సీమాంధ్ర, తెలంగాణలకు చెందిన ఉద్యోగుల్లో ఎవరికీ అపోహలు తలెత్తకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా, వివక్షకు తావు లేకుండా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విషయుంలో వూత్రం ఎలాంటి మీవూంస లేదు. వాళ్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పనిచేస్తారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో అన్ని కేడర్లూ కలిపి 57,397 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. సంవత్సరాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంవత్సరం రిటైరయ్యే ఉద్యోగుల సంఖ్య 2014- 5,500 2015- 17,605 2016- 16,892 2017- 17,400 మొత్తం 57,397