సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఉద్యోగులంతా కలిసి తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే బస్సు నాన్‌స్టాప్ సర్వీస్ పేరుతో నడుపుతూ ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఆమల్లోకి రావడంతో సమయానికి చేరుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోయారు.
దీనిపై తాము ఆర్టీసీ ఆర్ఎంకు ఫిర్యాదు చేయగా ఆయన సైతం ఎక్కడా ఆపవద్దంటూ ఆదేశాలు జారీచేసినా సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు సచివాలయానికి వెళ్ళబోమంటూ బస్సు నుంచి దిగి ఆందోళన చేస్తున్నారు.