హైదరాబాద్: ఏపీ కొత్త రాజధాని అమరావతికి తాము వెళ్లబోమంటూ తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో ఉంటేనే ఆంధ్రా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, మరి అమరావతికి వెళ్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే అమరావతికి వెళ్లలేమంటూ టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి టీఎన్జీవో నేతలు మద్దతు తెలిపారు. జూన్ లోనే తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.