సాక్షి, ముంబై: కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి క్రమంగా టెక్ దిగ్గజాలు గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మూడు దశల వర్క్ ప్లాన్‌ను అమలు చేస్తుండగా, తాజాగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఈ కోవలో చేరింది. వారానికి రెండు సార్లు ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులకు అంతర్గత సమాచారాన్ని అందించింది. దీనికి సంబంధించి మూడు దశల వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ప్లాన్‌తోపాటు ఉద్యోగులకు మరో సౌలభ్యాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించడం విశేషం.
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కృష్ణమూర్తి శంకర్ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ఈ విధానం ఉద్యోగులకు సౌలభ్యాన్ని కల్పిస్తుందని, “ఒకే పరిమాణానికి సరిపోయే విధానం కాదని పేర్కొన్నారు. మూడు దశలుగా దీన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. (WhatsApp మరో అద్భుత ఫీచర్: కంపానియన్ మోడ్, అంటే ఏంటంటే?)
దశల వారీగా
మొదటి దశ ఉద్యోగులు "వారి సౌలభ్యం ప్రకారం వారానికి రెండుసార్లు కార్యాలయానికి రావడానికి" వీలు కల్పిస్తుంది. రెండో దశలో, ఉద్యోగులు తమకు నచ్చిన బ్రాంచ్ కార్యాలయానికి బదిలీ లేదా మారడానికి వీలు కల్పిస్తుంది. ఇక చివరి దశలో ఈ రెండు దశల పని తీరు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా హైబ్రిడ్-వర్క్ పాలసీపై నిర్ణయ తీసుకుంటుంది. ఉద్యోగులందరినీ తిరిగి కార్యాలయానికి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు తిరిగి రప్పించేలా టీసీఎస్ ఇప్పటికే హైబ్రిడ్ మోడల్‌ను ప్రారంభించింది. (ElonMusk క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్)
Comments
Please login to add a commentAdd a comment