వారినుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందే
వారినుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందే
Published Sat, Mar 15 2014 1:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
ఆప్షన్ ప్రాతిపదికగా ఉద్యోగుల పంపిణీ చేయాలంటున్న చట్టం
కానీ ఆ తర్వాత ఏం చేయాలనే స్పష్టత శూన్యం
న్యాయ నిపుణులు, ఉద్యోగ సంఘాలతోను చర్చించే అవకాశం
వచ్చే 4ఏళ్లల్లో 57 వేలమంది పదవీ విరమణ
విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 56 వేల మంది ఉద్యోగుల్లోని ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కమలనాథన్ కమిటీ మధ్య జరిగిన భేటీ నిర్ణ రుుంచింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యో గుల పంపిణీ ఆప్షన్ ప్రాతిపదికగా చేయాలని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 56 వేల మంది ఉద్యోగుల్లోని ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ తీసుకోవాల్సిందేనని గురువారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కమలనాథన్ కమిటీ మధ్య జరిగిన సమావేశం నిర్ణరుుంచింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీ ఆప్షన్ ప్రాతిపదికగా చేయాలని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ కేడర్‌కు చెందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 56 వేల మందిగా ఉందని ఆర్థిక శాఖ లెక్కలు తేల్చింది. మరి కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తొలుత 56 వేల మందిలోని ప్రతి ఉద్యోగి నుంచి.. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో చెప్పాల్సిందిగా ఆప్షన్ తీసుకుంటారు. ఆ తరువాత ఏమి చేయాలో, ఏ వూర్గదర్శకాలను అనుసరిస్తారోననే స్పష్టత ప్రస్తుతం అధికారగణంలోనే లేదు. ఒక ఉద్యోగి స్థానికత నిర్ధారణకు జన్మస్థలం, చదువుకున్న ప్రాంతం, ఉద్యోగంలో చేరిన ప్రాంతం... ఇలా దేన్ని ప్రావూణికంగా తీసుకుంటారనే స్పష్టత కూడా లేదు.
వారికి మినహాయింపు ఇస్తారా?: పార్లమెంటు ఆమోదించిన బిల్లు మేరకు ఆప్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ తర్వాత ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల అభిప్రాయూలూ తీసుకుని సజావుగా విభజన అవులు చేయూలని భావిస్తున్నారు. కొద్ది సంవత్సరాల్లో రిటైరయ్యే ఉద్యోగులకు, ఒకప్రాంతంలో పుట్టి వేరే ప్రాంతంలో చదువుకుని ఉద్యోగాల్లో చేరినవారికి ఏమైనా మినహారుుంపు ఇస్తారా అనే విషయుంలోనూ ఉద్యోగ వర్గాల్లో సందేహాలు అలాగే ఉన్నారుు. దీనిపై వుుందుగా ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని ఆ కేటగిరీల్లోకి వచ్చే ఉద్యోగులు కోరుకుంటున్నారు. విభజన విషయంలో సీమాంధ్ర, తెలంగాణలకు చెందిన ఉద్యోగుల్లో ఎవరికీ అపోహలు తలెత్తకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా, వివక్షకు తావు లేకుండా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విషయుంలో వూత్రం ఎలాంటి మీవూంస లేదు. వాళ్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పనిచేస్తారు.
వచ్చే నాలుగు సంవత్సరాల్లో అన్ని కేడర్లూ కలిపి 57,397 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.
సంవత్సరాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సంవత్సరం రిటైరయ్యే ఉద్యోగుల సంఖ్య
2014- 5,500
2015- 17,605
2016- 16,892
2017- 17,400
మొత్తం 57,397
Advertisement
Advertisement