సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
Published Wed, Oct 22 2014 1:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హెల్త్‌కార్డుల జారీతోపాటు 15 రోజుల్లో 10వ పీఆర్‌సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆర్‌కు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశాయి.
పీఆర్‌టీయూ టీఎస్ అధ్యక్షులు పి.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.నరోత్తంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జునశర్మ, ఆల్ ఇండియా టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ బి.మోహన్‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ చైర్మన్ ఇ.వెంకటేశం, కో చైర్మన్ డి.సర్వయ్య, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నవ్వ ధమనేశ్వరరావులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement