హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగదారులకు త్వరితగతిన ఉత్పత్తులను చేర్చడం కోసం భారతీయ రైల్వేతో కలిసి పనిచేస్తున్నట్టు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 110కిపైగా ఇంటర్–సిటీ మార్గాల్లో సరుకులను చేరవేస్తున్నట్టు వివరించింది.
తద్వారా దేశవ్యాప్తంగా 97 శాతం పిన్‌కోడ్స్ ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల్లోనే కస్టమర్ల చేతుల్లో బుక్ చేసిన ఉత్పత్తులు ఉంటాయని తెలిపింది. 2019లో రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నాటి నుంచి సరుకు రవాణా మార్గాలను పెంచుతూ వస్తున్నట్టు అమెజాన్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment