ప్యాసింజర్‌ రైళ్లను ఇప్పట్లో నడపలేం | DRM Alok Thivari on Passenger Train Services Anantapur | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ రైళ్లను ఇప్పట్లో నడపలేం

Published Tue, Aug 18 2020 7:18 AM | Last Updated on Tue, Aug 18 2020 8:40 AM

DRM Alok Thivari on Passenger Train Services Anantapur - Sakshi

గుంతకల్లు: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నవంబర్‌ నాటికి కూడా ప్యాసింజర్‌ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్‌ఎం అలోక్‌తివారీ తెలిపారు. సోమవారం ఆయన గూగుల్‌ మీట్‌ యాప్‌ ద్వారా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనులను తెలిపారు. ఎర్రగుంట్ల – నంద్యాల మధ్య 123 కి.మీ, ధర్మవరం – పాకాల మధ్య 227 కి.మీ విద్యుద్దీకరణ పనులను 2021లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి – ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్‌ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో ఆధునిత ఎలాక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నిల్‌ వ్యవస్థను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.

మిషన్‌ రఫ్తార్‌లో భాగంగా గుత్తి – రేణుగుంట మధ్యలో 130 కిమీ వేగంతో సుమారు 280 కి.మీలు (రానుపోను) రైలు నడిపినట్లు తెలిపారు. ఈ స్పీడ్‌ ట్రయల్‌ రన్‌ను సీఓసీఆర్‌ (కన్ఫర్మేటరీ ఓసీలోగ్రాప్‌ కార్‌ రన్‌) ద్వారా  ఈ రైలు మార్గంలో ట్రాక్‌ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్‌ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి – వాడీ మధ్య ట్రాక్‌ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్‌ నాటికి ఈ మార్గంలో కూడా 130 కి.మీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్‌ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్‌ ఆస్పత్రిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement