పట్టాలు తప్పిన రైలు:19 మంది దుర్మరణం | 19 killed, over 132 injured in train accident | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు:19 మంది దుర్మరణం

Published Mon, May 5 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

పట్టాలు తప్పిన రైలు:19 మంది దుర్మరణం

పట్టాలు తప్పిన రైలు:19 మంది దుర్మరణం

132 మందికి గాయూలు
కొంకణ్ రూట్లో ఘటన.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
ప్రమాదంపై విచారణకు రైల్వేశాఖ ఆదేశం
 
 సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని కొంకణ్ రైలు మార్గంలో ఆదివారం ఉదయం ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా 132 మంది గాయపడ్డారు. దీంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రూ.2 ల క్షల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ప్రకటించారు. రైల్వే అధికారులు, రాయ్‌గఢ్ పోలీసుల కథనం ప్రకారం మొత్తం 20 బోగీలతో కూడిన దివా (ఠాణే-ముంబై)-సావంత్‌వాడి ప్యాసింజర్ ఆదివారం ఉదయం దివా నుంచి బయలుదేరింది. 10 గంటల సమయంలో నాగోఠాణే, రోహా రైల్వేస్టేషన్ల మధ్య నిది గ్రామానికి సమీపంలోని భిసెఖిండ్ సొరంగ మార్గం దాటగానే.. భారీ శబ్దంతో రైలు ఇంజిన్‌తో పాటు ప్రయూణికులతో నిండిన నాలుగు బోగీలు ఒకదాని వెంట మరొకటిగా పట్టాలు తప్పారుు. ప్రయూణికులు అనేకమంది బోగీల్లో ఇరుక్కుపోయూరు. ఒకరిపై మరొకరు పడిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమీప గ్రామ ప్రజలు ప్రమాద స్థలికి చేరుకుని ప్రయూణికులను బయటకు తీసేందుకు సహకరించారు.
 
 మారుమూల ప్రాంతం కావడం, మరోవైపు కొండ వాలు ఉండటంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టసాధ్యమైంది. సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులతోపాటు కుర్లా నుంచి బ్రేక్‌డౌన్ వ్యాన్, కళ్యాణ్ నుంచి మెడికల్ వ్యాన్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారుు. 12 అంబులెన్స్‌లతో కూడిన డాక్టర్ల బృందం గాయపడిన వారికి చికిత్సనందించడంతో పాటు తీవ్రంగా గాయపడినవారిని నాగోఠాణే, రోహాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ముంబైకి తరలించింది. తొలుత 13గా నమోదైన మృతుల సంఖ్య సాయంత్రానికి 18కి చేరింది. సంఘటన స్థలంలోనే మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం నాగోఠాణే ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.
 
 పమాదస్థలిలో చిక్కుకుపోరుున ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సమీప రైల్వేస్టేషన్లకు చేరవేశారు. ప్రమాద నేపథ్యంలో కొంకణ్ రూట్లో పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నిటిని దారి మళ్లించారు. ప్రమాదంపై రైల్వే మంత్రి ఖర్గే విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పగాయూలైనవారికి రూ.10 వేలు పరిహారంగా ప్రకటించారు. ప్రయూణికుల సమాచారం కోసం రైల్వేశాఖ హెల్ప్‌లైన్ (ఠాణే: 022-25334840) ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు.
 
 అతివేగమే కారణమా?
 
 ప్రమాదం జరిగిన భిసెఖిండ్.. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంది. వేసవి సెలవులు కావడంతో రైలు రద్దీగా ఉంది. ప్రమాదానికి రైలు అతివేగమే కారణమని ప్రయూణికులు తెలిపారు. ముఖ్యంగా టన్నెల్‌తో పాటు పెద్ద మలుపు ఉన్నప్పటికీ వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైలు ఆరవ బోగీలో ప్రయాణించిన నామ్‌దేవ్ కాటకర్ తెలిపారు. పట్టాలు తప్పిన తొలి నాలుగు బోగీల్లోని ప్రయాణికులే ఎక్కువగా మృతి చెందినట్టు ఆయన చెప్పారు. గత నెల ఓ గూడ్స్ రైలు కూడా ఈ మార్గంలో పట్టాలు తప్పింది. అంతకుముందు కూడా ప్రమాదాలు జరిగారుు. అరుునప్పటికీ ఈ విషయంలో కొంకణ్ రైల్వే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement