
పట్టాలపై ఆగిన కారును ఢీకొన్న రైలు
ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి
కలికిరి/వాల్మీకిపురం: పట్టాలపై ఆగిపోయిన కా రును రైలు ఢీకొన్న ప్రమాదంలో శనివారం ముగ్గురు దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన షేక్ టిప్పుసుల్తాన్ కుటుంబ సభ్యులతో కలసి కారులో కలికిరి మండలం అచ్చిపిరెడ్డివారిపల్లెకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇట్లంవారిపల్లె దాటిన తర్వాత గేటులేని రైల్వే క్రాసు వద్ద పట్టాలపై కారు ఆగిపోయింది. అందులో చిన్నారులతో కలిపి పదిమంది ఉన్నారు. ఆదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వేగంగా వస్తోంది. దీంతో అప్రమత్తమై కారులో ఉన్న పిల్లలను బయటకు విసిరేశారు. మిగిలిన వారిని తప్పించేలోపే రైలు కారును ఢీకొంది. సల్మా(30), ముంతాజ్(25), రాఫియా(2) మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టిప్పుసుల్తాన్ కారులోనే ఇరుక్కుపోగా ఆయనను బయటకు తీసేందుకు రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది.