స్కూల్ బస్సును ఢీకొన్నరైలు:ఐదుగురు మృతి | five student killed in train accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొన్నరైలు:ఐదుగురు మృతి

Published Thu, Dec 4 2014 10:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

five student killed in train accident

మావ్(యూపీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది.  గురువారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న స్కూల్  బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో  ఐదుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో్ మరో 20 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. 

 

ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు మావ్ లో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement