కలకలం రేపిన బాంబు వదంతి | bomb outrage in the railway station | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బాంబు వదంతి

Published Tue, May 20 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

కలకలం రేపిన బాంబు వదంతి

కలకలం రేపిన బాంబు వదంతి

 సాక్షి, ముంబై: బాంబు వదంతి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రోహా రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ పరిణామంతో రోహా-దివా ప్యాసింజర్ రైలు సుమారు నాలుగున్నర గంటల ఆలస్యంగా బయలుదేరింది. రోహా-దివాల మధ్య నడిచే రోహా-దివా పా్యిసంజర్ రైలు ఉదయం 5.15 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా కలకలంరేగింది. ఈ విషయం తెలుసుకున ్న పోలీసులు, సంబంధిత అధికారులు ప్రయాణికులందరినీ రైలులో నుంచి బయటికి పంపించారు. బాంబు తనిఖీ బృందం ఈలోగా అలీబాగ్ నుంచి రోహా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అన్ని బోగీలను తనిఖీ చేసింది. అయితే బాంబులుగానీ లేదా పేలుడు పదార్థాలుగానీ లభించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement