
ఫలించిన వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి
కడప– నంద్యాల మీదుగా నడుస్తున్న ప్యాసింజర్ రైలును జిల్లాలోని పలుచోట్ల ఆపాలని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది.
► ఈ నెల 20 నుంచి ఐదు స్టేషన్లలో నంద్యాల
► ప్యాసింజర్ రైలు ఆపేందుకు అనుమతి
కడప కార్పొరేషన్: కడప– నంద్యాల మీదుగా నడుస్తున్న ప్యాసింజర్ రైలును జిల్లాలోని పలుచోట్ల ఆపాలని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఐదు చోట్ల ఈ రైలును ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ వెల్లడించారు. సోమవారం రైల్వే జీఎంను కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
కడప– నంద్యాల ప్యాసింజర్ రైలును జిల్లాలోని ఎర్రగుంట్ల, ఎర్రగుడిపాడు, కమలాపురం, గంగాయపల్లె, కృష్ణాపురం స్టేషన్లలో నిలుపుదల చేయాలని స్థానిక ప్రజల విన్నపం మేరకు ఎంపీ అవినాష్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతోపాటు, కేంద్ర రైల్వే అధికారుల, సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, గంతకల్ డివిజన్ డీఆర్‌ఎంను కలిసి విన్నవించారు. ఆ విషయంపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇప్పటివరకూ ప్యాసింజర్ రైలును ఆపే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోలేదు.
సోమవారం ఎంపీ హైదరాబాద్‌కు వెళ్లి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి మరోసారి విన్నవించడంతో ఆయన స్పందించి ఈనెల 20వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో ఉన్న సమస్యలను కూడా ఎంపీ ఆయన దృష్టికి తీసుకుపోయారు.